పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0243-6 ఆహిరి సంపుటం: 08-258

పల్లవి:

ఆనతీవయ్యా యింకా ననుమానా లేఁటికి
యేనెపాల లేకున్న నిటువలెఁ జేసునా

చ. 1:

వసివాఁడు జూపులు వంచి నిన్నుఁ గొసరుచు
నసురుసురయ్యీఁ జెలి అది యేఁటికి
యెఁసగి యిందాఁకా మీరు యేకతాననె వుంటిరి
కనుగాటు రతులలోఁ గడమ యేమాయనో

చ. 2:

తలవంచుకొని నీతో తమకపు మాటలాడి
సొలయుచు నింతి మొక్కి పొలగిలీని
చలివాయ నిందాఁకా సరసము లాడితిరి
చలముతో మతికేమి సమ్మతిగాదాయనో

చ. 3:

సన్నలనే జంకించి జవ్వనపు మదమున
చన్ను మొన లటుచూపి సాదించీని
యిన్నిటా శ్రీవెంకటేశ యెనసితి రిద్దరును
పన్నిన మీపంతముల బలిమి యెంతాయనో