పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0238-4 వరాళి సంపుటం: 08-226

పల్లవి:

వేడుకకాఁడవు నీకు వెరుపలయ్యా
పాడిదప్పక యిచ్చేవు పంతాలేలయ్యా

చ. 1:

కావరించి వేగినంతా కలిగిన పనులెల్లా
వేవేలుఁ జేసివచ్చి వెరుపేలయ్యా
వోవరిలో నాచేతికి వొంటిఁజిక్కి యిప్పుడిట్టె
వోవలబెట్టెనంటా వొట్లేలయ్యా

చ. 2:

అంది పొంది వాడలోన అందరి యిండ్లనెల్లా
విందులారగించి వచ్చి వెరుపేలయ్యా
బందెఁజిక్కినట్టు మాపరువుపైఁ బవళించి
సందడిలో వారి వీరి సాకిరులేలయ్యా

చ. 3:

అచ్చముగా నన్నుఁ గూడి అన్నిటా శ్రీవెంకటేశ
విచ్చనవిడాయ నింక వెరుపేలయ్యా
మచ్చెము చిక్కెను నీమనసు నామీఁదను
వొచ్చెములెల్లాఁ దీరె నొడఁబాట్లేలయ్యా