పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0201-1 మధ్యమావతి సంపుటం: 08-001

పల్లవి:

తెగని పనులకు నింతేసి యాలే
మొగమోటతోడివి మోహములెల్లను

చ. 1:

అలిగిన విభుఁడు నిన్నట్టె వేడుకొనవచ్చె
చలమో ఫలమో సతి నీకు
వెలలేని కోపములు వేగినంతాఁ జేసినాను
కలయక మానేరా కాఁకలెల్లఁ దీరను

చ. 2:

తతి మాటాడనివాఁడు తానే సరసములాడీ
వ్రతమో యితవో వనిత నీకు
మతకాన మీరెంత మారుమోములై యుండిన
రతిఁ గూడకుండేరా రచనలతోడను

చ. 3:

యేడోవున్న శ్రీవేంకటేశుఁడే యింటికి వచ్చె
ఆడికో వాడికో అంగన నీకు
పాడి పంతములతోడ బలుములెంత చూపిన
వీడెమిచ్చి కూడితిరి వేరులయ్యేరా