పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0232-5 కొండమలహరి సంపుటం: 08-191

పల్లవి:

ఇన్నాళ్లునెఱఁగమైతి మింతేసిసుద్దులు
విన్నవి రాఁగారాఁగా వెల్లవిరులాయను

చ. 1:

మంతనాన నీతోను మాటలు నేనాడినని
యింతులెల్లా నాడుకొనే రిదేమయ్య
చెంతల నీవింతేసి సిగ్గులు విడిచితేను
కాంతలు నీతో పొందుగావించుటే నేరమి

చ. 2:

రతివేళ నామేనరచించిన నీచేఁతలు
సతులెల్లా సోదించేరు సారెసారెకు
యితవై నీవాడికకు యింతేసి వెరవకున్న
హితులూడిగాలు సేయనేఁటికి నీయెడకు

చ. 3:

ననుపున నీవు నేను నవ్విననవ్వులకును
వనితలెల్లా మెచ్చేరు వద్దనున్నట్టే
యెనసితివి శ్రీవెంకటేశ నన్నింతేసిగాను
చనవరులకును మజ్జాతియాయ నిపుడు