పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0203-2 బౌళి సంపుటం: 08-014

పల్లవి:

ఏమి సేసేరో తాము యిద్దరమూనేకము
కామించి తామెంత నన్ను గరశించేరు

చ. 1:

అప్పుడు నీవును నేను నాడుకొన్న మాటలే
చెప్పుమనుచును సారెఁ జెలులనేరు
చిప్పిల సరికిబేసిఁ జెనకిన చెనకులే
చొప్పులెత్తి తమకెల్లాఁ జూపుమనేరు

చ. 2:

నంటున మనమిక్కడ నవ్వినట్టి నవ్వులే
వొంటినుండి యీడనాతోనూహించేరు
జంటలఁ జెల్లించుకొన్న సరసపు చనవులే
వెంటవెంట వచ్చి వచ్చి వెలుచుకొనేరు

చ. 3:

వాడికెనొండొరులము వలచిన వలపులే
కోడి యెరుకలు సేసికొన వచ్చేరు
యీడనె శ్రీవేంకటేశ యెనసితి మింతలోనే
వీడెమిచ్చేమని యిట్టే వేగిరించేరు