పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ముడ్డికిఁ గాటు కేమిటికి? ముక్కిడిదానికి ముక్కరేల? బల్
గ్రుడ్డుల కేల [1]చల్వలును? గుక్కల కేలను చీని పల్లమున్?
.......................................................................
................తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

71

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ముడ్డికి కాటుక అవసరం లేదు. ముక్కు లేని వ్యక్తికి ముంగర అనే అలంకారం అక్కర లేదు. పుట్టుగ్రుడ్డివారికి చల్లదనాన్ని కలిగించే కళ్లజోడుయొక్క ఆవశ్యకత లేదు. అలాగే, పట్టుతో నిర్మించిన జీను కుక్కలకు అవసరం లేదు కదా!

  1. ఇక్కడ 'చెల్వలును'? అని ఉంటే 'పుట్టుగ్రుడ్డివారికి యువతులతో నిమిత్తంలేదు' అనే
    అర్ధం వెల్లడౌతుంది. అయితే ఇది కేవలం సూచనమాత్రమే గాని, పాఠాంతరం కాదు.