పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

71

27. మౌల్వీ లియాఖత్‌ అలీ

(1817-1892)

1857 నాటి తిరుగుబాటును తొలుత సిపాయీలు ఆరంభించినా, అన్నివర్గాల ప్రజలు అందులో భాగస్వాములయ్యారు. ఆ క్రమంలో తమ కలాలకు శలవు చెప్పి ఖడ్గాలను చేతపట్టీ పోరాటంలో పాల్గొన్న పండితులలో మౌల్వీలియాఖత్‌ అలీ ఒకరు.

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం అలహాబాద్‌ జిల్లా చాయిల్‌ తహసిల్‌లోని మహాగాౌవ్‌ లోని చేనేత కార్మికుల కుటుంబంలో లియాఖత్‌ అలీ 1817 అక్టోబర్‌ 5న జన్మించారు. తల్లి అమీనాబి, తండ్రి సయ్యద్‌ మెహర్‌ అలీ. చిన్నతనంలోనే లియాఖత్‌ ధార్మిక పరిజ్ఞానం తోపాటుగా బ్రిటిష్‌ వ్యతిరేకతనూ సంతరించుకున్నారు. ఆయనబ్రిటిష్‌ సైన్యంలో చేరి భారతీయసైనికుల మనస్సుల్లో ప్రబుత్వ వ్యతిరేకతను నూరిపోయసాగారు. అది పసకట్టి ఆయనను సైన్యం నుండి బహిష్కరించారు. ఆ తరువాత మౌల్వీ స్వగ్రామం మహాగాౌవ్‌ కేంద్రంగా ప్రజలకు ధార్మిక మార్గదర్శనం చేస్తూ ఉపాధ్యాయునిగా బ్రిటిష్‌ వ్యతిరేక ప్రచారాన్ని పున:ప్రారంభించి స్వదేశీ పాలన పున:ప్రతిష్టకోసం, న్యాయమైన హక్కుల సాధన కోసం ప్రజలు ధర్మపోరాటం సాగించాలని ఉద్బోధ చేయసాగారు.

అలహాబాద్‌ ప్రాంతంలోని బ్రిటిష్‌ వ్యతిరేక వర్గాలన్నిటిని ఐక్యం చేసి ఒక వేదిక మీదకు తెచ్చి కంపెనీ పాలకుల మీద సమరశంఖారావం పూరించారు. 1857 జూన్‌

చిరస్మ రణీయులు