పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. నవాబు మీర్‌ ఖాశిం

(- 1777)

ఆంగ్లేయులను భరతగడ్డ మీద నుంచి పూర్తిగా తరిమికొడితే గాని వారి దోపిడి నుండి స్వదేశీయులకు విముక్తి కల్పించలేమని భావించి, రాజ్యక్షేమం, ప్రజల సౌభాగ్యం ఆకాంక్షిస్తూ, ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల మీద సమర శంఖాన్ని పూరించి, చివరి వరకు పోరుబాటలో సాగిన యోధులు మీర్‌ ఖాశిం.

ఆంగ్లేయులతో చేతులు కలిపి ప్లాసీ యుద్ధంలో నమ్మకద్రోహానికి పాల్పడిన మీర్‌ జాఫర్‌కు కంపెనీ పాలకులు తిలోదకాలు ఇచ్చాక బెంగాలు గద్దె మీద జాఫర్‌కు స్వయాన మేనల్లుడైన మీర్‌ ఖాశింను కూర్చోపెట్టాలని గవర్నర్‌ వాన్సిటర్ట్‌ నిర్ణయం మేరకు 1760 సెప్టెంబరు 27న మీర్‌ ఖాశిం బెంగాలు నవాబు అయ్యారు.

ఆ సమయంలో ప్లాసీ యుద్ధ విజయంతో చెలరగిపోయిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ గుమాస్తాలు, దాస్తావేజుల రాతగాళ్ళు, వర్తకులు అపరిమిత అధికారాలతో, అంతు లేని ధనకాంక్షతో రాబర్టు క్లైయివు ఆరంభించిన ధనసంచయాన్ని కొనసాగిస్తూ ఇష్టా రాజ్యంగా ప్రవర్తించసాగారు. ఈ అనుచిత ప్రవర్తన వలన స్వదేశీ వర్తకం ఇబ్బందుల్లో పడింది. రైతులు, వర్తకులు, ఉత్పత్తిదారులు ఇక్కట్లు పడసాగారు. అధికారుల అనుచిత ఆజ్ఞలను ప్రజలు పాటించాల్సి వచ్చింది. కంపెనీ అధికారుల, ఆంగ్ల ఉద్యోగుల, వర్తకుల చిత్తానికి