Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కురులు కొనగోళ్లచే దు
వ్వి రసంబులు చిల్కు కమ్మవిరులం జెవిపై
నెరవిరులు బాగుగా ని
ల్పిరి కొప్పులు దిద్ధి యానిలింపాబ్జముఖుల్.

23


వ.

ఇవ్విధంబున నవ్విలాసినులు చీనిచీనాంబరసుగంధానులేప
నానర్ఘ్యమణిభూషణమనోహరమాల్యంబులు ధరించి.

24


సీ.

ముఖచంద్రరోచులు మోహరించినఁ జూచి
             వేనలిచీఁకట్లు వెనుకఁ దొలఁగఁ
గౌను సింగంబులఁ గనుఁగొని కుచకుంభి
             కుంభముల్ ఱవికల కొంగులీఁగఁ
బలుకు కోకిలకూఁత లలరిన నధరంపుఁ
             బల్లవంబులు ద్విజపంక్తిఁ జేర
దరహాసచంద్రికల్ తళుకుచూపినఁ బాద
             సరసిజాతంబులు సంచలింప


తే.

వఱలి మట్టియ లందియల్ సరవి మొరయఁ
గాంచికాదామకింకిణీక్వణన మెసఁగ
నీరజాక్షులు సురపొన్ననీడఁ దపముఁ
జేయుచున్నట్టి తుల్యుఁ గాంచిరి ముదమున.

25


వ.

అయ్యవసరంబున.

26


క.

ఒక్క కమలాక్షి యలసతఁ
జిక్కితి నని యుత్తరీయచేలమునఁ గడున్
గ్రిక్కిఱిసిన నునుగుబ్బలఁ
జిక్కిన గంధంబు [1]కమ్మ చెమటల నార్చెన్.

27
  1. గ్రమ్మఁ జెమటల