Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నతండును నవ్వీరవరుల నంపగమిం గప్పి నిశ్చేష్టితులఁ
గావించి భేదించి సూచీవ్యూహంబు సొచ్చి యచ్చట నెదు
రుపడు కేకయులపై నిశితశరానీకంబులు నిగిడించి వారలం
గడచి చనునెడ సుదక్షిణుం డడ్డంబు వచ్చిన నతని నొక్క
నారాచంబునఁ జచ్చినట్ల యుండునట్లుగాఁ జేసి పోవు
నప్పుడు ధర్మనందనుండు గవలునుం దానును నతనిపై
నాశుగసముదాయంబులు వఱపిన నవి నడుమన చూర్ణం
బులై తొరఁగనేసిన యమ్మువ్వుర మూఁడువాఁడిబాణం
బుల నొప్పినొందించి తద్బలంబు బడలుపడ నడచి పద్మ
వ్యూహంబు డగ్గఱి పాంచజన్యం బొత్తిన.

56


సీ.

ఆకృష్ణుఁ జూచి సైన్యంబు భీతిల్లి బె
             బ్బులిఁ గన్న మృగములపోల్కిఁ బఱవ
నది చూచి యర్జునుఁ డాకుండినేశ్వరుఁ
             [1]డటఁ జచ్చియుండునో యని తలంచి
తనతోడఁ బోరు సాత్యకి సీరపాణుల
             డించి తీవ్రమున నేతెంచి సేన
మగుడంగఁ బురికొల్పి బెగడు చతుర్ధన
             జననాథుఁ దెల్ఫి యా చక్రపాణిఁ


తే.

దాఁకి నిబిడాశుగంబుల తళ్లు గురియ
నతఁడు నాతనిఁ గప్పెఁ బేరంపసమితి
నంత నారామశైనేయు లరుగుదెంచి
యామురాంతకుఁ గూడి రుద్దామలీల.

57
  1. డలజడిఁ బొందునో యని తలంచి