Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బృందావనంబునఁ గ్రేపుల మేపుచు
             నాఁకొని చల్ది జలాశయంబు
దరిఁ [1]జేరి వాండ్రతోఁ దా నారగింపఁగ
             నేగఁ దన్మహిమంబు నే నెఱుంగఁ
దలఁచి బాలుర వత్సములఁ దలఁగింప నా
             కృష్ణుఁ డవ్విధము నెఱిఁగియుఁ దాన


తే.

కొమరులును లేఁగలును నయి గొల్లగుబ్బె
తలకు నాలకు ముద్దుగాఁ దనర నొక్క
వత్సరం బగునంత నే వచ్చినం జ
తుర్భుజాకృతితో నాకుఁ దోఁచె మఱియు.

175


తే.

బాలవత్సకములయందుఁ బార్థివేంద్ర
శంఖకౌమోదకీచక్రశార్ఙ్గకరుఁడు
కౌస్తుభోరస్కుఁడును నీలకాంతితనుఁడు
నగుచుఁ బొడకట్టె నే నంత నమ్మహాత్ముఁ.

176


క.

చరణముల కొరఁగితి మ
చ్ఛిరములు దద్రేణుపటలిచేఁ బూతములై
పరగఁగ నానందాశ్రులు
గురియఁగ నాదేవుకడ ముకుళితకరుఁడనై.

177


మ.

శివ సర్వాత్మక వాసుదేవ హరి రాజీవాక్ష గోవింద మా
ధవ దామోదర యజ్ఞభోక్త జగదాధారా ప్రపంచాత్మ దా
నవసంహారక చక్రపాణి మునివంద్యా బ్రహ్మవైకుంఠకృ
ష్ణ విరాజధ్వజ యాదవేంద్ర సుగుణా నారాయణా భూధరా.

178
  1. జెలికా