Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కోద్భుట్టాదితాళదర్పంబులు మొదలగు నూటొక్కతాళం
బుల నొత్త భృంగీశ్వరుండు పతాకాత్రిపతాకార్ధచంద్ర
కటకాముఖ్యాద్యసంయుతహస్తంబు లిఱువదినాల్గును
స్వస్తికగజదంతాదిసంయుతహస్తంబులు పదుమూఁ
డును స్థాయిసంచారివ్యభిచారిభేదంబులం దనరు దృష్టులు
ముప్పదితొమ్మిదియుం గుంచితావనతకంపితసమంబు లనం
బొల్చు శిరోభేదంబులను వృశ్చిక[1]ఛిద్రమయూరమండలాది
కరణంబులుం జక్రాదిభ్రమణవిశేషంబులు గలతాండవంబు
బహువిధగతులం జూపి రంత.

100


శా.

శుభ్రాంశూజ్జ్వలమౌళి మెచ్చి శిర మస్తోకంబుగా నూఁపె జూ
టాభ్రద్వీపవతీప్రవాహచలనవ్యాధూతహేమాంబుజా
దభ్రామోదభరప్రమత్తమధుపద్వంద్వాతిఝంకార[2]రిం
ఖాభ్రాజచ్చటులోర్విరావములు దిగ్వ్యాప్తంబులై నిండఁగన్.

101


వ.

అయ్యవసరంబున.

102


శా.

ఆవిశ్వేశ్వరుఁ జూచి యవ్విభుఁడు జాతానందుఁ డై "శ్రీమహా
దేవాయ త్రిపురాంతకాయ గిరిజాధీశాయ కుంభీనస
గ్రైవేయాయ నమో నమోస్తు విమలాకారాయ తే మేచక
గ్రీవాయ ప్రమథాధిపాయ” యని మ్రొక్కెన్ నిర్వికారాత్ముఁడై.

103


మ.

అనఘా, వెండియు నూర్ధ్వమార్గమున నశ్వాధీనుఁడై రాజు దాఁ
జనియెన్ భూమికి లక్షయోజనముపై చాయ న్విలోకింప భా
వన సేయంగ నశక్యమై తనరు దివ్యజ్యోతిరాకారమై

  1. ఛత్ర
  2. కం, కాభ్రాచ్ఛచ్చటులోర్విరావములు