భేరుండ మండలీకమృగబేంటెగార సమరరాహుత్తరాయ,
సంగ్రామధనంజయ, కోదండవిద్యాపాండిత్యరఘురామ,
యపరిమితభూధానపరశురామ, నిరంతరభోగసుత్రామ,
యష్టదిగ్రాజమనోభయంకర, దుష్టలాంకుశలారూసరిగ
జాంకుశ, [1]ఇప్పత్తేళుదండియరనాయంకరతలగుండగండ,
హెన్నుకట్టుకుదిరికట్టుమండలీకరగండ, [2]యెబిరుందగండ
సర్వబిరుదరకొవర, వేశ్యాభుజంగ, యనవరతకనక
కర్పూరదానధారాప్రవాహాద్యనేకబిరుదప్రశస్త మధ్య
మమండలాధీశ్వర, భోగివంశపయఃపారావారరాకాసుధా
కర, శ్రీచిత్తాంబుఖానమహీమహేంద్రదక్షిణబాహూ
పరిలసద్విశ్వవిశ్వంభరాభారధౌరేయుండును, సుజనవిధే
యుండును, భాషానిర్జితభోగీంద్రుండును, భోగవినిర్జిత
దేవేంద్రుండును, ధరణీమండలవదాన్యాగ్రణియును,
బంధుచింతామణియును నగు నమ్మంత్రిమణివాక్యంబు లంగీక
రించి మద్విరచితకావ్యకన్యకాకంఠమంగళసూత్రాయమా
నంబగు తదీయవంశక్రమం బభివర్ణించెద.