Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బుల యొప్పుఁ గలిగి సురనది
పొలుపునఁ జను దివిజతురగముం గనుఁగొనియెన్.

46


వ.

ఇట్లు కనుంగొని యాశ్చర్యహృదయుండై చనిచని ముందట.

47


సీ.

బహువిధమాణీక్యపటలకాంతిచ్ఛటా
             రాజితకృతికధరాధరములఁ
గాంచననీరేజకల్హారవాసిత
             విమలాంబుదీర్ఘికాసముదయముల
సురతక్రియాసముత్సుకవిలాసివ్రాత
             సంచారయోగ్యకుంజస్థలముల
మార్గణయాచనాదౌర్గత్యమోచనా
             కల్పవిభ్రాజితకల్పకముల


తే.

దేవతాసార్వభౌమకీర్తిప్రతాప
భవ్యబీరుదాంకమాలికాపఠనలీలఁ
గిన్నరీద్వంద్వశారికాకీరపికము
లను నిరీక్షించి పొంగె నా జనవిభుండు.

48


వ.

మఱియు.

49


క.

అటఁ జనిచని కనుఁగొనియెం
బటుతురగనిరూప్యమాణపథమున నతఁ డు
త్కటవినుతదైత్యమానస
పుటభేదనమైన దివిజపుటభేదనమున్.

50


వ.

కనుఁగొని తదుపరిభాగంబునం జనిచని.

51


చ.

కరకరితోడి రిత్త యలుక ల్పచరించి మనోజకేళికిం
బురిగొననీక [1]కోపమునఁ బోనడవం గడునల్గి వేలుపుం

  1. కాఁకమెయిఁ బోరడనం