Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తెరలచందము గని వెఱచి తీవ్రంబుగా
             నఱచి యంతంతఁ గేళ్లుఱుకుఁ గొన్ని
వీఁకమైఁ జని పోగుదాఁకి క్రమ్మఱ భీతి
             నేవరి పొదలసం దీగుఁ గొన్ని


తే.

వెనుకవారలు తఱుమంగ వేగిరమునఁ
బిల్లతండంబు తమమ్రోలఁ బెట్టుకొనుచుఁ
గినుకతో వచ్చి యచ్చట జనులఁ జూచి
నిగుడఁజాలక గుంపుగా నిలుచుఁ కొన్ని.

139


క.

అప్పుడు ధరణీకాంతుఁడు
ముప్పిరిఁగొను సంభ్రమము ప్రమోదము వెఱఁగుం
జొప్పడఁగ నామృగంబులఁ
దప్పక కన్గొని గృహీతధనురస్త్రుం డై.

140


క.

ఎందును బథికులు పొడఁగని
[1]డెందములోఁ గలఁకఁబడుచుఁ దిట్టుదురను నీ
కుం దేల? వలదు మాన్పెదఁ
గుందేలా! యనుచు నతఁడు కూలఁగ నేసెన్.

141


క.

కలకలము సేయు మనుజుల
యెలుఁగులు విని చెదరునట్టి యెలుఁగుల నేసెన్
బొలమెల్లఁ గలికిచూపుల
యెలములచే నిర్లుకొలుపు నిర్లం ద్రుంచెన్.

142


క.

ఏరీతి నోర్తు నే భూ
దారుఁడ నగు టెఱిఁగి యెఱిఁగి తా మిచ్చట భూ

  1. తెందేఁపలు గాఁగ నిన్నుఁ దిట్టుదురను నీ