Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కత్తెరల నెత్తుడుతెరలను బూని తమమేనిపొంకంబులును
బింకంబులును భయంకరంబులు గాఁగ సంతతహింసిత
మృగవ్రాతు లగుకిరాతులు సంతోషంబున.

127


సీ.

నీలికాసెలమీఁదఁ గీలుకొల్పినయట్టి
             నెలవంకకత్తుల తళుకు లెసఁగఁ
బొలుచు జుంజురుమీసముల నీలకాంతుల
             మొగముల నఱుక్రమ్మి ముంచుకొనఁగ
మిట్టగ్రుడ్డులమీఁదఁ దొట్టిన కెంజాయ
             చరమసంధ్యారక్తి చౌకళింపఁ
గర్ణార్పితంబులై గనుపట్టు సంకుటా
             కులు కృష్ణపక్షతారల హసింపఁ


తే.

జెలఁగి తలముళ్లు వాకట్టు తిలకములును
గసుమెఱుంగులు [1]గుతిమందులును ధరించి
పందివాటులు చేపట్టి పంతములకు
నొండొరులఁ గూడఁ బోయిరి దండి మెఱసి.

128


వ.

అందు.

129


సీ.

ఎరమీఁదీపులినైన గొఱియచందంబునఁ
             గొనివత్తు మిదె చూడు మనెడువారు
నఱిమెడు సింగంబునైనఁ బ్రాణంబుతో
             డనె పట్టి తెచ్చెద మనెడువారుఁ
జండించు గండభేరుండంబునైనను
             గనుకట్టు కట్టెద మనెడువారుఁ

  1. గుడి