కఠినపదములకు అర్థములు
పద్యము | పదార్థములు | |
1 | అపాంగము = కడకంటిచూడ్కి; నిర్యత్ = వెడలు; ఘృణ = కృప. | |
14 | ధ్వాంతము = చీకటి. | |
16 | పంచాస్యంబు = సింహము; పరశువు = గొడ్డలి, లవిత్రంబు = కొడవలి, భేకి = ఆడుకప్ప. | |
105 | నాచికొను = హరించు. | |
150 | జంగమలింగము = చరించుశివుఁడు = శివభక్తుఁడు. | |
151 | చెలఁది = సాలెపురుగు; ప్రోక = రాశి. | |
152 | జీవగఱ్ఱ = జీవనౌషధము, తంబుర, వీణ మున్నగువాని దండములో శ్రుతి హెచ్చించుటకుఁ దగ్గించుటకు నమర్చు పిడి. | |
153 | పడ్డలు = గోవులు. | |
158 | బద్దులు = అసత్యములు. | |
173 | తెగినతప్పున = హాని కలిగించినదోషమున. | |
182 | పూన్తు = పూజింతును. | |
192 | అలుఁగువార = ప్రవహింప. | |
194 | ప్రాఁతవాఁడ = భృత్యుఁడ; అడిగఱ్ఱ = పాదసేవకుఁడు. | |
207 | అంగవింప = అతిక్రమింప. | |
209 | ఉపాదానము = కారణము. | |
213 | కృకర, దేవదత్త, ధనంజయములు = ఉపవాయుభేదములు. | |
214 | లాల = చొంగ; అస్రము = రక్తము; మజ్జ = ఎముకలందలి చమురు. | |
220 | లతాంతములు = పుష్పములు | |
223 | భిస్సట = మాడినయన్నము; చికురము = వెండ్రుక | |
256 | సిక్థము = మెతుకు. | |
259 | మొదవు = గోవు. | |
299 | వైనతేయుండు = గరుత్మంతుఁడు, గద్ద | |
301 | పాంసువు = ధూళి. | |
————