కుముదిన్యాదులు మన్మథపూజఁ గావించుట
గీ. |
ఓలతాతన్వి యీవసంతోత్సవమునఁ
గోరి మదనుని బూజించుకువలయాక్షి
తనకు ననుకూలుఁడైనట్టి ధవునిఁ గూడి
చెలఁగి మనుఁగాన మనము పూజింత మనుచు.
| 40
|
సీ. |
వలగొన్న గొజ్జంగియెలదీవెమగులున కసదుమొగ్గలు [1]పిల్లనసులు గాఁగ
గొప్పకప్రపనంటిగుమురుటుప్పరిగెకుఁ దెములునాకులు కేతనములు గాఁగఁ
బ్రబలిన సురపొన్నభవనేశ్వరమునకు సుమపాంసువులు వితానములు గాఁగఁ
బొదలిన గురివెందపూఁబొదచవికెకు సమదభృంగములు ధూపములు గాఁగఁ
దనరు విరిదోఁటనగరిలోఁ దావిమావి, జగహజారంబునెడ ఘనసారవేది
కర్ణికాసింహపీఠిపైఁ గలువఱేకు, పట్టు జముకాళ మనువందఁ బఱచి యందు.
| 41
|
గీ. |
చిగురుపటమునఁ బూఁదేనె మొగడకణికఁ
గొలువుమెఱసిన మరు వ్రాసి కోపులందు
రతివసంతుల వ్రాసి తత్ప్రాంతసీమ
భ్రమరకీరపికాదుల వ్రాసి నిలిపి.
| 42
|
క. |
ద్రాక్షామధురాధర ల, య్యిక్షుశరాసుం బ్రసూనహేతిదళితఫా
లాక్షు నుచితోపచారవి, చక్షణలై పూజసల్పి సమధికభక్తిన్.
| 43
|
ఉ. |
దండము నీకు సామి రచితప్రమదేశశరీర మోడ్పుఁగే
లండజరాజగామిహృదయంగమవిక్రమ వందనంబు దో
ర్దండయశస్సమాశ్రయపితామహవక్త్ర జొహారు సూనకో
దండవిలాసవీక్షణవిధానధురీణసహస్రలోచనా.
| 44
|
ఉ. |
సాయుధుఁడై త్రిపుండ్రధరుఁడై నిటలాక్షుఁడు గాడ్పుసోఁకులం
బోయెడు నొండురెండు[2]పురము ల్దెగనేయు టిదేమివింత యే
యేయెడ నేకపుండ్రము వహించి సమస్తజగత్ప్రపంచముల్
మాయఁగఁ జేయు నీయెదుట మన్మథ మానవతీభయంకరా.
| 45
|
గీ. |
చెలువమున నీకుఁ దమ్ముఁడై [3]చెలఁగువాని, ననఘవిక్రమహరిసూతి యైనవాని
గనుఁగవకుఁ జంద్రభానువై తనరువానిఁ, గుముదినికి భర్తఁగాఁ జేయు కుసుమవిశిఖ.
| 46
|
క. |
అని ప్రార్థించుచుఁ గుముదినిఁ గనుఁగొని మదనునికి వినతి గావింపుమనన్
మనమున లజ్జయు నలఁతయుఁ, బెనఁగొన నొకరీతి మ్రొక్కి బిత్తరికలఁకన్.
| 47
|
- ↑ చ-ట-పిల్లిపసలు
- ↑ ట-పురము ల్పగనేయు
- ↑ చ-ట-యలరువాని