Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

చిఱునును జెందొవల్ చికిలిచంద్రికపై పఱపు, ల్పరాగముల్
పఱచినపైఁడివ్రాతవలిపంబులు, పాయని జంటజక్కవల్
కుఱుచతలాఁడబిల్లలుగఁ, గోమలి యిచ్చటఁ గాననయ్యె నె
[1]త్తఱు లలరాజ[2]హంసవనితాతతి దూఁగెడు డోలలో యనన్.

25


[3]క.

బలిసద్మద్వారేంద్రో, పలఫలకకవాట మనఁగఁ బరఁగె సరసి యూ
ర్ములు గందపట్టియలుగాఁ, జిలుగుసరోజములు బిగువుచీలలు గాఁగన్.

26


క.

అలిగర్భకుముదముకుళము, పలిజక్కనమేను సోఁకి వడఁకుచు నంత
ర్విలసితద్రుతి నలరెన్, గొలంకుసిరిచంట సకినె కులికె ననంగన్.

27


క.

సూనయుతనాళమానస, మానం గ్రేంకార మొక్కహంస మొనర్చెన్
మానిను లట రా జలఖగ, సేవల కెఱిఁగింప నఫిరిసేసె ననంగన్.

28


చ.

అని కొనియాడి కొమ్మలు శయంబులఁ బూనిననర్మవాక్యముల్
పనుపడఁ గోక లూడ్చి [4]కరపావడ లంట బిగించి సొమ్ము లొ
య్యన సడలించి యొండొరులయంసము లూఁతలు గొంచుఁ జొచ్చి రిం
పున సరసి న్మరుం డొఱలు పుచ్చిన కత్తులఁ బోలి బిత్తరుల్.

29


గీ.

చెలువ లప్పుడు నెలకొన్నసిగ్గుచేత, వక్షముల జేరిచిరి కరస్వస్తికముల
నెగసి చనుజక్కవలఁ గూడి యేగు ననుచుఁ,బదరి చనుజక్కవల నంటఁబట్టిరనఁగ.

30


ఉ.

కొండొకపాయపుంగొమరుగుబ్బెత యోర్తు కొలంకు డిగ్గుచో
నండకు వచ్చినట్టి చెలియంసము చేతులఁ బట్టి వ్రేలె లో
నిండినభీతి నాత్మకళ నేర్పుటకై వలరాచయొజ్జ కో
దండము వైచెనాఁ దఱటుదార్కొనుకైవడి వేణి తూలఁగన్.

31


క.

చెలువలు సరసీజలముల, నిలిచిన లోఁ గన్నుఁగవలనీడలు దోఁచెం
జెలిచెక్కుఁజందురులకై, తలఁకుచు నడుగంటు నచటితమ్ములరీతిన్.

32


గీ.

చెలులు కొందఱు తమమీఁద జలముఁ జల్ల
మగువ లొకకొంద ఱవి కేల మగుడ నాని
రలఘుజఘనాభిఘాతార్తి నరుగుదెంచు
సలిలముల కిచ్చి రభయహస్తంబు లనఁగ.

33


చ.

నెలఁత యొకర్తు నెమ్మొగమునీడ నవాంబుజమంచుఁ గైకొనం
దలఁచి కరంబు సాఁచుటయుఁ దక్కరముం బెఱతమ్మిరీతి సం

  1. చ-తరగలు
  2. ట-హంసకవితానము
  3. ఇదియుఁ బైదియుఁ ట-లో లేవు.
  4. క-కనెపావడలు