Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఆలమునన్ దిశ ల్గెలిచి యాడఁగఁ బోవ వియుక్తరక్తముల్
హాళి ననంటిపూవుపెర లన్బలుదోనెల నించి చిల్కతే
జీలకుఁ జూపఁబోలు ననసింగిణిజో దిటు గాక యున్నచో
నేల వహించుఁ గెంపుజిగి నీకదళీసుమకీరతుండముల్.

105


ఉ.

మావుల మారు క్రొంజిలుకమావులవేడెము దిద్ద గండపుం
దావులగాడ్పుసాహిణి లతాకశ పూని మిళిందయుక్త మౌ
లేవిరిగుత్తిగిల్కఁ గదలించుచు ధే యని కూఁతవైచె నా
నావిధపల్లవాశనకనత్కలకంఠకుహూరవార్భటిన్.

106


సీ.

శాపనివృత్తికై చనుదెంచు వెడవేల్పురాచత్రాఁ చన భృంగరాజి తనర
సంగడి శాస్త్రము ల్చదివెడుశిష్యుల చెలువునఁ గెలయుకోవెలలు సెలఁగ
విన్నందుటకు మనవికి డాయువింధ్యశృంగములు నాఁ బుప్పొడిగట్టు లెసఁగఁ
గట్టినకావికోకలచెఱంగులరీతి నెడనెడఁ దలిరాకు లెగసియాడ
నెలమిఁ దనుఁ గన్నద్విజపంక్తు లెదురుకొనఁగ
సారెఁ బెల్లుబ్బు యువజనశ్రమజలాబ్ధి
నిముడుకొన దక్షిణము వాసి యేగుదెంచెఁ
గొదలునడతోడఁ బవమానకుంభజుండు.

107


[1]ఉ.

అంతట రుక్మబాహువసుధాధిపనందన యొక్కనాఁడు శు
ద్ధాంతగృహంబు వెల్వడి విహార[2]రతిం జనుదెంచె నెచ్చెలుల్
చెంతలఁ గొల్వ గుంజదళిశింజితరంజితకుంజమంజుల
ప్రాంతగళత్ఫలాసవరతాంగజఘోటికిఁ బుష్పవాటికిన్.

108


క.

ఏతెంచి చందనాచల, శీతలతనుగంధవహవశీకృతలవలీ
చూతైలావాసంతీ, జాతామోదములఁ దేలి సంతస మందన్.

109


సీ.

[3]కమ్మనిపూనీటికాల్వ వ్రీలినచోటఁ గంబూరమున నంటఁ గట్టి కట్టి
వలపుతోఁ గురువేరు వాడువాఱినచోటఁ బూనీరు కుండలఁ బోసి పోసి
చలిమావిరసముల జౌకు లెత్తినచోటఁ గలువపుప్పొడి నించి బలసి బలసి
పరువంపుమరువంబు పదను దప్పినచోట వలిమంచు గూడల వైచి వైచి
సుమములకు మూఁగుతేఁటులఁ జోపి చోపి
యీరముల రాలుతనిపండు లేఱి యేఱి

  1. ఈపద్యము ఆంధ్రకవులచరిత్రములో ఎలకూచి బాలసరస్వతి గ్రంథములోని దని యున్నది.
  2. చ-గతిన్
  3. పన్నీటికాలువ పజ్జఁబొర్లినచోట గంబూరమున నడ్డుకట్టఁ గట్టి