Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పిఠరప్రవ్యక్తదంష్ట్రాపృథుమథనభవత్ఫేనసంతానకుల్యా
లుఠనార్ద్రోన్నిద్రజిహ్వాలుఠనభయదఫల్గుధ్వనిన్ రాజుఁ బల్కెన్.

52


ఉ.

ఓరి వరాక నేఁడు మది నోడక మామకకాననాంతముం
జేరుట యెట్లు చేరి పయిచేటు గణింపక కండక్రొవ్వునం
దే రిది యెక్కు టెట్లు విధి ద్రిప్పుకరాఁ బొలకై కడంగునా
బారికి నగ్గమైతి విదె [1]బల్విడి మ్రింగెద నీక్షణంబునన్.

53


క.

ఎచటికి నరిగెద వని రా, త్రిచరుం డాభీలశూలరేఖఁ [2]జదలఁ ద్రి
ప్పుచుఁ జటులహుం,క్రియార్భటి, నచలము లూటాడ నతిరయంబున వైవన్.

54


[3]స్రగ్వణి.

గాఢనక్తంచరగ్రామభస్మీకృతి, ప్రౌఢరుద్రేక్షణప్రాయశృంగత్రయీ
లీఢఘంటారవాళీకరాళాంతకృ, ద్రూఢగర్జాప్రజారుంతుదధ్వాన మై.

55


శా.

ఆశూలం బరుదేరఁ గ్రూరతరబాహాగర్వదుర్వారుఁ డై
యాశాభూధరకూటకోటి వడి నూటాడంగ బిట్టార్చి ధా
త్రీశోత్తంసము విల్లువంచి గొనయం బెక్కించి చే మించి నా
నాశాతాశుగము ల్నిగుడ్ప నది సాంద్రజ్వాలికాభీల మై.

56


భుజంగప్రయాతము.

కరాళాశుగౌఘంబుఁ గైకోక పైపై
నరాళాకృతి న్రా మహాబాహువీచీ
మరాళచ్ఛటాస్ఫూర్తిమద్వజ్రహేతి
త్వరాలక్ష్మిఁ దచ్ఛూలదండంబుఁ ద్రుంచెన్.

57


గీ.

త్రుంచుటయు నఖర్వదుర్వారకోపిఁ డై, యసురశక్తి వైవ హరిమతుండు
దానిఁ బటుకృతాంతదంష్ట్రానితాంతశి, ఖాంతకాంతకుంతహతి నడంచె.

58


క.

తనశక్తి యిట్లు వడనం, తన భక్తి వహింప కసుర తత్సమరమునం
దనుశయముఁ దొఱఁగి క్రమ్మఱ, ననుశయమున లీల నొకమహాగద గొనుచున్.

59


[4]మత్తకోకిల.

రాజరాజయకాంక్ష న న్నెదుర [5]న్నరుం డితఁ డెంత యా
రాజరాజసఖుండు నోపఁ డరాతిఘాతిధృతాసిధా
రాజరాజున కస్మదస్త్రపరంపరల్ జత జంభవీ
రాజరాజముఖామరావళి నైన నే [6]నలయింపుదున్.

60


మాలిని.

అని యనితరధార్యాహార్యశౌర్యాస్పదం బై
కనకన మని నిప్పు ల్గ్రక్కునుద్యద్గదం గ్ర

  1. చ-ట-బట్టి మెసంగెద
  2. చ-ట-జెదరఁ
  3. ట-లో లేదు.
  4. ట-లో నీక్రింది నాలుగుపద్యములు లేవు.
  5. చ-ధర న్నరుఁడెంతయా
  6. బొలియించెదన్