Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హర్మ్యతటీకులాయావిశత్కలరవపక్షార్భటులు సాంధ్యపటహరుతులుఁ
జంద్రద్రుతాబ్జాశ్మసౌధాంబునినదంబు లార్ధరాత్రికతమ్మఠారవములుఁ
గలసి శ్రీరంగధామమంగళమహోత్స, వాచరణవైభవంబుల నతిశయిల్లఁ
బౌరసంఘాత మతిలోకభావనాస, మంచితాశ్చర్యగరిమ నాలించు నిచట.

107


లయగ్రాహి.

కాంచితివె పైబిరుదుపించెము లనం గబరు లించుక చలింప వసనాంచలపతాకల్
మించ మణిఘ౦టలు రహించఁ గటిచక్రములు సంచలనమానఁగనుమించుటలు గుల్దీ
పించఁగుచఖేటకము లుంచి బొమసింగిణులు నించి జయ మీవు గన నంచలరథంబుల్
పంచె మునుమున్న సురసంచయమన న్మెఱసిరం చనడనిందుసతులించువిలుకాఁడా.

108


శా.

వీరల్ తెర్థికవైష్ణవు ల్గనుము పూవిల్కాఁడ సద్భక్తిఁ గా
వేరిం దాన మొనర్చి రంగవిభు సేవింపం దమిం గాంచి యు
న్నా రున్నస్తకయుక్కరాబ్జు లయి "భో నాగేంద్రశాయి న్నమ
స్తే రంగేశ” యటంచు దేహళుల మెంతే నిక్కి వీక్షించుచున్.

109


[1]ఉ.

ముప్పిరి గొన్నవేడుకఁ దముం జనము ల్గన మోక్షచింతలోఁ
దప్పక చేతికంచుచిటితాళపుమోఁత్రలఁ బాయ కెప్పుడుం
జప్పటులన్ బుధోత్తములు సందడి సేయుచు మూఁక గూడ రం
గప్పను బాడుచుం జనుమహాత్ములఁ జూడుము సూనసాయకా.

110


చ.

మడవ ల్మార్చుచుఁ దీర్చుచు న్లతలకుం బాదు ల్దగంజేసి యం
దెడ లౌచోటుల నంట్లు నిల్పుచును నీరెత్తించుచుం క్రొవ్విరుల్
దొడిమ ల్విచ్చి నరాలు గట్టుచును నెందుం దార యై పాటులం
బడుధన్యాత్ములఁ గంటివే మదన యీమాల్యార్చనాధీశులన్.

111


[2]శా.

వీణావేణుమృదంగనాదముల కువ్విళ్లూరుచు న్మండప
స్థాణుల్ ప్రాఁకియు మెట్టు లెక్కియును నచ్చోఁ గేళిక ల్సల్పున
య్యేణీనేత్రలఁ జుట్టువారుకొని కంటే కాంచుచున్నారు గ్రా
మీణుల్ నిశ్చలలోచనాబ్జులయి లక్ష్మీగర్భముక్తామణీ.

112


[3]మ.

మునుముందాన మొనర్చి పుండ్రములు శ్రీముద్రాంకము ల్పూని సూ
ననికుంజావృతసైకతస్థలుల గంటల్ మ్రోయఁగాఁ గేశవా

  1. ఇదియు దీని క్రిందిపద్యమును క-లో లేవు.
  2. ఇది ట-లో లేదు.
  3. ఇదియు దీనిక్రింది రెండుపద్యములును క-లో లేవు.