Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తూలంబులఁ గ్రోలఁ దివురు విషమవిషవిస్ఫుటస్ఫటావంతంబు లన వాలం
బులు దూల నఖర్వగర్వోత్తరంగంబు లగుకురంగంబులపైఁ జెంగున దాఁటి
వడిం గెడపి మెడల వెడలునుడుకునెత్తురు కుత్తుకలబంటి గ్రోలి యఱగొని
గిరిదరులఁ దరలకయుండి మఱునాఁడు పేరాఁకట నేకటంబడుచుఁ బ్రబలత
మతమోగుణరేఖావిమిశ్రితోదారసశరీరవీరరసంబులచందంబున మురుబొం
దుల యెఱచి కఱచి పఱచు శార్దూలసంఘాతంబులసంకేతంబులఁ గ్రూరమ్ము
లగు మాఱమ్ము లునుప నియమించియు మఱియుఁ గారుపోతు కణఁతి మ
నుబోతు దుప్పి మొదలగు మృగంబులకుఁ దెరువు లగునిరవులఁ దత్తదుచిత
సాధనంబులు సవరింపంబంచియు, గాలి పరికించి యెగువదిక్కునకు నడిచి
యక్క డక్కడ మీటు గలపొదలచాఁటునఁ బోటరుల నెదురుపాటు గా
కుండ నిలిపి పార్శ్వంబుల జాగిలంబులతోడివాగురికుల నునిచి పటహఢ
క్కాదివాద్యంబులు చఱపించియుఁ దుపాకి మొదలగు నగ్నియంత్రంబులు
ముట్టించియుఁ జోపుడు వెట్టించి తాను దగుపట్ల నుచితక్రమంబుల నాఖేట
కార్హసాధనసన్నద్ధుండై విజయలోలుం గడఁ గూడి సంచరించుచుండె నట్టి
యెడ.

33


శా.

త్రస్తైణంబు పతద్వలీముఖము నృత్యత్ఖడ్గ మత్యాహిత
గ్రస్తక్రోడము ఢౌకమానశశ మాక్రందన్మృగేంద్రంబు వి
స్రస్తద్వీపి ఫలాయమానకరి నిర్యద్వాహవిద్వేషి వ్య
త్యస్తక్రోష్టృక ముద్భ్రమద్గవయమై యక్కాన ఘూర్ణిల్లఁగన్.

34


[1]సీ.

జాగిలాలపసిండిసరిపెణ ల్సడలించి పట్టెడ ల్దుయుముడి గట్టువారుఁ
జాఁటునఁ గనుఁగొని మోటు తప్పక నిల్చి తెగనిండఁగా విండ్లు దిగుచువారుఁ
నదలించి బిరుదున నెదురేగి పందిపో ట్లుగ్గుటంబులచాయ నొడ్డువారుఁ
దెరలకు డాయ నిబ్బరపుబొబ్బల వేఱుపఱిచి యోదములకుఁ దఱుమువారు
[2]నగుచు నానావిధమృగప్రహారఘోర
సన్నహనసావధాను లై శబరభర్త

  1. ఇదియు దీని తరువాయిపద్యమును క-లో లేవు.
  2. చ-నగుచు నానావిధమృగవ్యవ్యసను లగుచు
    విపినతల మెల్లఁ దామయై వెల్లివిఱిసి
    యొకనినొక్కనిఁ జీరుచు నోహటించి
    యురుపరాక్రమయుక్తులై మెరసి రపుడు.