Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అని యూహించి మదిష్టదైవతము భక్తాభీప్సితార్థోపపా
దనకారుణ్యకటాక్షశాలియు రమా[1]ధామావతారాగ్రగ
ణ్యనవోన్మేషపవిత్రమూర్తియును దత్తాత్రేయుఁడే కాన నా
ఘను నస్త్మత్కృతినాథుఁ జేయఁగ నమోఘప్రీతితో నున్నెడన్.

10


సీ.

ద్విజరాజకార్శ్యము ల్దీర్చు నీవిభుకీర్తి ద్విజరాజకార్శ్యము ల్దీర్చు టరుదె
యాజిభవస్ఫూర్తి నడరు నీనృపుశౌర్య మాజిభవస్ఫూర్తి నడరు టరుదె
యతిసురభిఖ్యాతి నలరు నీఘనునీగి యతిసురభిఖ్యాతి నలరు టరుదె
చంద్రగోత్ర[2]శ్రీఁ బొసంగు నీపతికల్మి చంద్రగోత్ర[3]శ్రీఁ బొసంగు టరుదె
యనుచు బుధు లెన్న వెలయు రాజాధిరాజ, రాజపరమేశ సకలకర్ణాటకాంధ్ర
రాజధౌరేయ తిరుమలరాయతనఁయ, చంద్రుఁడగు వేంకటపతిక్షితీంద్రమణికి.

11


చ.

అనుపమకార్యకర్తయును నగ్రజుఁడు న్మహనీయసత్కళా
ఖనియు నఖండకీర్తీకళికాసురభీకృతసర్వదిఙ్ముఖుం
డును నగుదత్తనార్యుఁడు నను న్వినయాన్వితుఁ బార్శ్వవర్తిఁ గ
న్గొని పలికె న్సుధారసనిగుంభనజృంభితవాక్యవైఖరిన్.

12


మ.

గురువిద్వచ్చరణారవిందభజనాంకూరన్మహోదారధీ
గరిమ న్నీ వొనరింపఁబూనుకృతికిం గైవల్యలక్ష్మీమనో
హరు నస్మత్కులదైవతోత్తముని దత్తాత్రేయయోగీశ్వరు
న్వరుఁ గావింపఁ దలంచి తెన్నఁ దరమే వత్సా భవద్భాగ్యముల్.

13


క.

ఈపరమయత్న మఘని, ర్వాపణ [4]మన ఘాస్మదీయవంశగురుతప
స్యా[5]పారంబున నీమది, దీపించెన్ బళి కులప్రదీపక యనినన్.

14


ఉ.

సంతన మంది యేను బితృసన్నిభుఁడున్ హితదేశికుండు న
శ్రాంతశుభప్రదుండు నయి రంజిలుదత్తనమంత్రివాక్య మ
త్యంతవినీతిఁ గైకొని కృతార్థుఁడనై బహుపుణ్యగణ్యత
ల్గాంతు నటంచుఁ గౌతుక[6]విలాసవిభాసితమానసంబునన్.

15


క.

శ్రీమద్దత్తాత్రేయమ, హామునిముద్రావిభూషితాత్మీయకృతి
శ్రీముఖభూషణముగ మ, త్స్వామిగుణస్తుతి యొనర్తు సమధికభక్తిన్.

16
  1. క-ధారాప్రధారాగ్రగణ్యనగోన్మేష
  2. చ-శ్రీ లొసంగు
  3. చ-శ్రీ లొసంగు
  4. చ-ఘన మస్మదీయ
  5. చ-పాశంబున
  6. చ-వికాస