Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ణామౌనిం బచరించి తుంబురునివల్నం గన్నగాంధర్వవి
ద్యామాహాత్మ్యముఁ జూపి [1]శౌరినుతుఁడై తాల్చెం గృతార్ధత్వమున్.

206


మ.

వితతధ్యానమదాలసాతనయనిర్విప్రాయ విప్రాయన
క్షతశంకాకరభక్తశోభనవిరాజన్మా యజన్మాయతి
ద్యుతికామప్రతిసంఘసంఘటితయోగోపాయ గోపాయనో
ద్యతమూర్తాస్మదఖండభాగ్యసముదాయచ్ఛాయ యచ్ఛాయదా.

207


క.

విశ్వనుతశశ్వదణిమా, ద్యైశ్వర్యవిశేషధుర్య యఘపాదపపా
రశ్వధికవర్య సాక్షా, ద్విశ్వంభరతాకృతార్యవిస్మయచర్యా.

208


భుజంగప్రయాతము.

భవాద్యాభిగద్యాత్మపద్యానవద్యా
నవాధ్యాత్మవిద్యానిషద్యాప్తవేద్యా
యవిద్యార్తివైద్యాయవిద్యాయహృద్యా
భవోద్యానసద్యాభవద్యాంబుపద్యా.

209


గద్యము.

ఇది శ్రీమద్దత్తాత్రేయయోగీంద్రచంద్రచరణారవిందవందనసమాసా
దిత సరసకవితారసోదాత్త దత్తనార్యసోదర్య మల్లనమంత్రివర్యప్రణీతం బైన
చంద్రభానుచరిత్రం బనుమహాప్రబంధంబునందు సర్వంబునుం బంచమా
శ్వాసము.

  1. చ-తద్వినుతుఁడై