Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

కలువల నేలవే వెడఁదకన్నులు చన్నులు పైఁడికుండలం
గెలువఁగఁజాలవే చికిలికెంజిగి క్రొంజిగురాకురేకుఁ లేఁ
దళుకులఁ దోలవే మృదుపదమ్ములు [1]దమ్ములు నించు చొక్కపున్
వలపులఁ బోలవే వదనవాసన లీసునయప్రచారకున్.

196


సీ.

కోకముల్ శశిమ్రోలఁ గూడలే వను టెట్లు శశిమ్రోల నిదె కూడెఁ జక్రయుగము
చీఁకటు ల్రవిదీప్తిఁ జేరలే వను టెట్లు రవిదీప్తి నిదె చేరెఁ బ్రబలతమము
అళులు సంపెఁగలచెంతలఁ జేర వను టెట్లు సంపెంగ నిదె చేరె షట్పదములు
కమలము ల్కరికేలఁ గడునొప్ప వను టెట్లు కరికేల నిదె యెప్పె సరసిజములు
నాననము చన్నుగవయు సీమంతమణియుఁ
దుఱుము నాసయుఁ గనుదోయి తొడలు చరణ
పల్లవంబులు ననుపేరఁ బరిఢవిల్లెఁ
జూడరే యింతు లిది యెంతచోద్య మరయ.

197


చ.

అని పొగడ న్యదుప్రవరుఁ డాత్మకుమారుల నానవాబ్జలో
చనల గృహప్రవేశశుభసంపదఁ బెంపు వహింపఁజేయ వా
రును గురుదేవతాభజనరూపమహాచరణం బొనర్చి త
ద్ఘనతరభద్రసూక్తుల సుఖస్థితిఁ గైకొని రంత నొక్కెడన్.

198


సీ.

[2]వరుల నెంతయుఁ బెన్కువలఁ దేల్చు ప్రతిమల కురువిదూరజరుచుల్ తెరలు గాఁగఁ
జెలువలమ్రోల దేశి నటించు ప్రతిమల [3]కరుణాశ్మదీప్తిదీపార్చి గాఁగ
రమణులతో వసంతము లాడు ప్రతిమల కలఘువజ్రమరీచి కొలను గాఁగఁ
గాంతుల నవ్యసంగతి కుల్కు ప్రతిమల కింద్రనీలచ్ఛాయ లిరులు గాఁగ
నధిపుల వరించుప్రతిమల కమితహరిత
మణిగభస్తులు దూర్వాంకమాల్యములుగ
నొనరు కేళీగృహంబున నున్నయయ్య
దూద్వహకుమారకుని యుల్ల ముల్లసిల్ల.

199


క.

కడుఁ బ్రార్దింపఁగఁ దగుజను, లడుగడుగున కెత్తులిడఁగ నలఁతి దివియఁగా
వెడవిల్తుతేరు నడచిన, వడువున సతి వచ్చెఁ గనకవసనావృత యై.

200


చ.

వనితలచాఁటున శుభనివాసము సొచ్చి మఱుంగు చేరి ని
ల్బినయది గావునం దరలలేమి యధీశునిమ్రోల సిగ్గునం

  1. క-దేహము నిండుకాంతితో
  2. క-వరులచెక్కులకళ ల్వలదెల్పు
  3. క-కరుణాశ్మరింభోళికళలు గాఁగ