Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

వలయవ్రాతము పైకిఁ ద్రోఁచి పదము ల్వాటంబుగా [1]నూఁది లే
జిలుఁగుంబయ్యెదకొంగుఁ జెక్కి యలఁతం జేమార్చుచు న్నమ్రయై
బెళుకుంగౌను గురు ల్చలింపఁగ సరు ల్పింపిళ్లు గూయం దమిం
దలయంటెం జెలి యోరతు వేడ్క నఱగంటం జొక్కురాచూలికిన్.

148


చ.

కెలన నొకర్తు బంగరపుగిన్నియఁ జందన మూని నిల్వఁగాఁ
గలయఁగఁ బెన్నెఱు ల్పులిమి గందము పైఁజిలికించి గోరుము
క్కుల దిగదువ్వి చేఁ బిడిచి కోమలియోర్డు కరాంబుజద్వయీ
లలితసువర్ణకంకణకలధ్వని వీనులవిందు సేయఁగన్.

149


మ.

తళుకున్బయ్యెద జాఱఁ జన్నుఁగవచెంత న్మించుడాలీనుకు
చ్చెలకొంగు ల్గుదియించి తంబుగలఁ జేచేఁ గొంద ఱందీ నొడల్
కలయ న్వేపధు వూన నూర్పు లడరంగా వేడ్కతో నొక్కనె
చ్చెలి కంసాంతకసూతికి జలకమార్చెన్ [2]గాంగతోయంబులన్.

150


క.

కడకొంగు ముడిచి తలపా, వడ యొకచెలి చుట్టె నొక్కవనిత తనువునం
దడియొత్తెఁ జలువదుప్పటి, పడఁతియొకతె యొసఁగె నానృపాలాగ్రణికిన్.

151


ఉ.

ఒక్కలతాంగి కైయొసఁగె నొక్కవధూటి కిరీటిపచ్చఱా
ముక్కలిపీఁట వెట్టె నొకముద్దియ కుంచియవైచె వెండ్రుకల్
చిక్కెడలించె నొక్కకలశీకుచ తొయ్యలియోర్తు జూళువా
చక్కనిబెజ్జపున్ బరణిసందుల ధూపము గొల్పె మెల్పునన్.

152


సీ.

కుఱుచకచంబులు గూడఁగూడఁగ దువ్వి యొఱపుగా సిగవైచె నొకవధూటి
పలుదెఱంగులకదంబపుఁబూవుటెత్తులు చుట్టెఁ జుట్టుగ నొక్కనూసగంధి
జీవరత్నంబులు చెక్కినసంపెంగ[3]మొగ్గతాయెతు లొక్కముదిత చేర్చెఁ
బన్నీటఁ బదనైన పైగోవకస్తూరితిలక మొయ్యన నొక్కతెఱవ దీర్చెఁ
వెలఁది యొక్కతె కుంకుమకలప మలఁదెఁ
దరుణి యొక్కతె గొజ్జంగిసురటి విసరె
మగువ యొక్కతె జిలుఁగుధూమ్రంబుఁ జిలికె
నువిద యొక్కతె నునుసోఁగయొంటు లిడియె.

153


క.

చెలి యొకతె పచ్చపట్టెల్, బలసిన బిదుహెళిసెసరిగెపనిపైఠానీ
చలువయఱచట్టఁ దొడిఁగెన్, సలలితగతి నొకతె కడకశలు ముడి వైచెన్.

154
  1. క-మెట్టుచున్
  2. చ-గంధతోయంబు
  3. చ-తాయిత మొకతె వింతగ నమర్చె