Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దావలముగా వదరుపూవిలుతుమావుల విరావముల [1]తావులగు క్రోపులకుఁ గ్రేవం
దావితొనబావిచలిరేవులసమీపమధుపావళివళావళులచే వెలయుత్రోవన్.

62


క.

[2]కంజరజఃపింజరతరు, కుంజరటదలిన్వనానుకూలనిగుంజ
న్మంజీరపుంజరంజిత, మంజులసింజారవంబు మల్లడిగొనఁగన్.

63


శా.

రావే యోవనమాలికా పొదలు చేరంబోకువే మల్లికా
యేవే బంతులు పద్మినీ యిచట లేదే తేనె వాసంతికా
తీవ ల్దూఱకు చంద్రికా యఱవిరు ల్దె మ్మిందిరా యంచు వ
న్యావీథి న్విహరించు తొయ్యలుల వాక్యంబు ల్వినన్వచ్చినన్.

64


శా.

ఆనాదంబు హృదంబుజాతమున కాహ్లాదంబుఁ గల్పింప నే
నానానూననికుంజపుంజములలోనం దూఱి యచ్చోట న
మ్లానామందమరందబిందురతిలీలాడోలబాలాళినీ
గానాధీననవీనసూనలతికాగారాంతరాళంబునన్.

65


శా.

కర్ణాంతాయతనేత్రకోణరుచు లగ్రక్షోణి [3]రాణింప సౌ
వర్ణాంభోజముఁ గేలఁ ద్రిప్పుచు నటద్వక్షోజయై బాలికా
తూర్ణాందోళితడోలికాంతరమునం దూఁగాడు చొక్కింత సౌ
ఖ్యార్ణోరాశిఁ జెలంగఁ గంటి నని యత్యానందముం జెందుచున్.

66


క.

ఏలాయతడోలాయత, లీలాయతనంబుకడ నళిభ్రమకరశో
భాలాలసఖేలాలస, బాలా లసమానదృష్టిపథమున నిలువన్.

67


క.

వనితాజనతావినుతా, ననతామరసంబు మలఁచి నను నాచెలి భా
వినితాంతావనితాంతా, వనతాంతాపాంగకోణవైఖరిఁ గనుచున్.

68


సీ.

పలుచనిచెమట గుబ్బల నంటి మూఁపునఁ [4]దొలఁకుపయ్యెదఁ జక్కఁద్రోచిత్రోచి
పిఱుఁదు నూయెల లూఁచు తెఱవలకై మోము మలఁచి నిల్వుమటంచుఁ బలికిపలికి
చేరు లంటఁగఁ బట్టి చికిలిమట్టెలు మ్రోయ నుర్వర మునివ్రేళ్ల నూఁదియూఁది
కౌను నిక్కఁగ నొండుకరమున వేనలి సవరించుచును దిగజాఱిజాఱి
తత్తఱంబునఁ బదములు తడఁబడంగఁ, బిఱుఁదువ్రేఁగునఁ జిఱుదొడ ల్బెళుక దిశలు
చెదరి చూచుచు నూర్పులు చెదర డిగ్గి, యలరుటెలమావిపొదదండ కరిగి నిలిచి.

69


చ.

అలరులతేనెఁ చ-గ్రోలుతమిగ్రోలి తమి నాడెడుతేఁటుల ఱెక్కసోఁకుచే
నలఁతిగఁ బాయలైన తలిరాకులసందులఁ జిత్తజల్లుగాఁ

  1. చ-తావులకు
  2. కంజరజఃవింజరతర
  3. చ-రాజింప
  4. ట-దొలఁగుపయ్యెద