Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

సమదమయూరికాగణము శంబరవైరి సివంబు లాడఁగా
సమయపుజక్కులీఁడు హరిచాపపుగోణముఁ దాల్చి మబ్బుజొం
పములను బెట్టిదంపుటురుము ల్మొఱయించుచు మ్రోల నిల్పెఁ బ్రా
థమికపయఃకణార్ద్రవసుధాతలవిస్పురదూష్మధూపముల్.

31


[1]మ.

అలజీమూతకిశోరకుండు నవవర్షాశ్రు ల్దిగంబాఱ గ
ర్జిలుదంభంబునఁ బోరువెట్ట గగనశ్రీధాత్రి క్రొమ్మించుచే
తులచే నుగ్గిడ నొల్కి తచ్ఛకలసందోహంబు వర్షోపల
చ్ఛలన న్రాలెనొ కానిచోఁ గరఁగునే సంతప్తభూసంగతిన్.

32


మ.

స్తనితంబు ల్విని భీతినభ్రతటినీచక్రాంగము ల్టెంకికిం
జనుచోఁ దద్రయవాతజాతహతపర్జన్యావళీసంధులం
గనుఁగోనైన తదీయహేమమయపక్షచ్ఛాయలో నాఁగఁ బై
కొనియె న్దట్టము గాఁగ నెల్లకడలం గ్రొమ్మించు లక్కారునన్.

33


చ.

తొలుకరి నంబుదాళి శరధోరణి నింపుచు రాజహంసమం
డలముల నాక్రమించిన వడంకి ధరంగలరాజహంసమం
డలములు [2]క్రౌంచగర్భమునఁ డాఁగె ఘనార్తి జనించె నేని నీ
చులకడ కేగరే నిజవిశుద్ధతఁ జూడక యెట్టివారలున్.

34


చ.

హరిహయుఁ డభ్రవీథిఁ జెలువారెడు పచ్చనివిల్లు పాంథభి
కరముగ నెత్తి తానసమకాండమహోన్నతిఁ జూప ధాత్రిపై
హరిహయరూఢిఁ బూనిన యనంగుఁడు పచ్చనివిల్లు పాంథభీ
కరముగ నెత్తి తానసమకాండమహోన్నతిఁ జూపె నీసునన్.

35


క.

ఎచ్చటఁ జూచినఁ దఱచై, పచ్చిక కన్పట్టె ధాత్రి బహుళాంబుదని
ర్యచ్చటులజలమయంబున, నచ్చగు శైవాలరేఖ లడరె ననంగన్.

36


[3]చ.

సమధికవక్రలీలల దిశాతతిపై ముఖఫేనకందళం
బుమియుచు [4]సింధువు ల్పటురవోద్ధతి మీఱి నవాగమాలికా
దమస మొనర్పఁగా నపుడు ధాత్రి వహించెఁ గదంబనూతనో
ద్గమకమనీయసూనకళికానికురుంబకశాప్రకాండముల్.

37


చ.

విడువనివేలమై ఫణుల వ్రేలఁగఁగట్టినరీతి వర్షముల్
జడిగొన నానుచుం గుతికిలంబడి ఱెక్కలు విచ్చి పజ్జలన్

  1. ఇదియుఁ బైమూఁడుపద్యములును ట-లో లేవు.
  2. క-క్రౌంచపూగమున
  3. ట-లో నీపద్యము లేదు.
  4. చ-సింధుబాలలు రదోద్ధతి