పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఘటికాచలమాహాత్మ్యము


ర్తాకర మాదితేయగిరిదారి లసత్సుమనోభివృద్ధి లం
కౌకమురీతిఁ బుణ్యజనతాశ్రయ మా సర మొప్పు నెప్పుడున్.

4


సీ.

కలహంస పరిధూత[1]గరుదువ్యదబ్జస
రాగంబు పటవాసరజము గాఁగ
ఉదబిందు మౌక్తికయుత పత్ర[2]పుటహల్ల
కములు రత్నారాత్రి[3]కములు గాఁగ
[4]కరువలి నెగసి యుప్పరమున నొప్పు పు
ప్పొడితెప్ప యుల్లడ పొలుపు గాఁగ
తేటిపూబోఁడులపాట ముత్తైదువల్
పచరించు సోబానపాట గాఁగ
ఖగవిరావంబు ద్విజమంత్రకలన గాఁగ
[5]రాలుకేసరములు తలఁబ్రాలు గాఁగ
పద్మినీ పద్మినీమిత్ర పరిణయంబు
గరిమదగు నల యంబుజాకరము కరము.

5


క.

ఆమానససరసీతట
భూమిన్ భృగ్వాశ్రమంబు వొలుచున్ తీర్థ
వ్యామోహ గతాగత సక
లామర మౌనీంద్ర సముదయాధారం బై.

6


సీ.

వాలసంచాలనోద్వేలత చమరీమృ
గమ్ములు సమ్మార్జనమ్ము సేయు
తుండసంభృతతీర్థకుండోదకమ్ముల
గలభముల్ [6]కలయంపి గలయఁ జల్లు
పచ్చికస్తురియసల్ దెచ్చి భల్లూకముల్
గోముఖశ్రీఁ బాదుకొనఁగఁ జేయు
కరికుంభ[7]గలిత ముక్తాఫలమ్ములు దెచ్చి
శుకములు రంగవల్లికలు దీర్చు

  1. గరుడయత్మంజనురాగంబు. తా.
  2. పట. తా.
  3. కలును. తా.
  4. తరువుల నెగసి....యుల్లెడ పూ.ము.
  5. వ్రాలు. తా.
  6. కలయంబ.
  7. కలిత. పూ. ము. తా.