పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

ఘటికాచలమాహాత్మ్యము


చ.

పలుకఁగ నంట నూర్చఁ గనఁ బాడ ముఖాంబుజ మెత్త [1]కాలిసో
కుల నుమియంగఁ గౌఁగిలిడ గోగు రసాలము సింధువారమున్
తిలకము ప్రేంకణంబు గణుతింపఁగ సంపెఁగ [2]పొన్న వంజుళం
బల సురపొన్న క్రోవియుఁ బ్రియమ్మున గ్రొవ్విరులిచ్చె హెచ్చుగన్.

112


చ.

సుర యుమియంగఁ గేసరము చూచినచోఁ దిలకంబు [3]కౌగిలిన్
గురవము తన్న వంజులము కూరిమిఁబాడఁగఁ బ్రేంకణంబు చే
పరపుల మావి మూర్కొనఁగ వావిలి పల్కఁగ గోగు మోము నె
త్తరమున జంపకం [4]బుమియఁ దా సురపొన్నయుఁ బూచె నయ్యెడన్.

113


మధురగతిరగడ.

పూవిలు[5]తుని యమ్ములపొది మామిడి
యీవలరాచల మేటికె గామిడి
పాదిరి పూవులపై [6]చెయి సాచకు
సాదువ వౌదువు సకి మమ్మేచకు
యేలకి తీవల కేటికె వాదులు
యేలె వగలు మీ రెంతటి సాదులు
ఇందువదన రమ్మీవిరితీవకు
నందని పూవుల కాసకుఁ బోవకు
అలయించక చెలి యాడల వాడకు (?)
పొలతులు రారే పొన్నల నీడకు
[7]పొగడలు పువులివి పొలతులు కోయకుఁ
[8]డగడుతనమ్మున నందఱు డాయకుఁ
డీమొల్లలకై యేలే రంతులు
ఏమిట తక్కువె యీ సేవంతులు
విరవాదుల కా విడువని రోసము
మరచితివా చెలి మన్నన దోసము
[9]సురవొన్నల యంచలగను సేయకు (?)

  1. గాలి. తా. పూ. ము.
  2. గున్న. పూ. ము.
  3. కౌగిటన్ . తా.
  4. బునగ.
  5. దుది
  6. చై
  7. పొగడపూవు లీ పొలతుక. తా. పొగడపూవు లివి పొలతుక. పూ. ము.
  8. నగడుగాదె మీరందరు డాయగ. తా, కనగడుగాది మీరందు డాయకు పూ. ము.
  9. ఈ పంక్తి పూర్వముద్రణమున లేదు.