పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7/G60


(2) రక్షణ అధికారులు సాధ్యమైనంత వరకు మహిళలై ఉండవలెను మరియు విహితపరచబడిన అట్టి విద్యార్హతలు మరియు అనుభవము కలిగియుండవలెను.

(3) రక్షణ అధికారుల మరియు అతని యొక్క ఇతర సబార్డినేటు అధికారుల సేవా నిబంధనలు మరియు షరతులు విహితపరచబడినట్టివై ఉండవలెను.

రక్షణ అధికారుల విధులు మరియు కర్తవ్యములు.

9.(1) రక్షణ అధికారి ఈ క్రింది కర్తవ్యములను నిర్వర్తించవలెను.--

(ఎ) ఈ చట్టము క్రింద మేజిస్ట్రేటుకు అతని విధులను నిర్వర్తించుటలో సహాయము చేయవలెను.

(బి) గృహహింసకు సంబంధించిన ఫిర్యాదు అందినపుడు విహితపరచబడిన రీతిలో మరియు అట్టి ప్రరూపములో గృహ సంఘటన నివేదికను మేజి స్ట్రేటుకు మరియు ఎవరి అధికారితా పరిధిలోని స్థానిక హద్దుల లోపల ఆ సంఘటన జరిగినదని ఆరోపించబడినదో ఆ ప్రాంతములోని పోలీసు స్టేషను ఇన్ ఛార్జి పోలీసు అధికారికి మరియు సేవలు సమకూర్చు వారికి ఆ ఫిర్యాదు ప్రతులను పంపవలెను;

(సి) సహాయము కొరకు రక్షణ ఉత్తర్వు జారీ చేయుటకై వ్యధితవ్యక్తి కోరినపుడు విహితపరచబడిన అట్టి రీతిలో మరియు అట్టి ప్రరూపములో మేజిస్ట్రేటుకు దరఖాస్తు చేయవలెను;

1967 చట్టములోని 39 వ చట్టము.

(డి) న్యాయ సేవల ప్రాధికారముల చట్టము, 1987 క్రింద వ్యధిత వ్యక్తికి న్యాయ సహాయము అందించుట కొరకు ఫిర్యాదు చేయుటకు విహితపరచబడిన ప్రరూపమును ఉచితముగా అందించునట్లు చూడవలెను;

(ఇ) మేజిస్ట్రేటు యొక్క అధికారితా పరిధిలోనున్న స్థానిక ప్రాంతములోని న్యాయ సహాయమును లేక సలహాలను అందించు సేవలు సమకూర్చు వారుల, ఆశ్రయ గృహముల మరియు వైద్య సదుపాయముల, వివరముల జాబితాను నిర్వహించవలెను;

(ఎఫ్) సురక్షితమైన 'ఆశ్రయ గృహము ఏర్పాటు చేసి వ్యధిత వ్యక్తి కోరికపై వ్యధితుని అట్లు ఆశ్రయ గృహములో ఉంచిన నివేదికను ఆశ్రయ గృహము ఉన్న ప్రాంతము యొక్క అధికారితా పరిధిలోని మేజిస్ట్రేటుకు మరియు పోలీసు స్టేషనుకు పంపవలెను;

(జి) వ్యధిత వ్యక్తి ఒంటి పై గాయములున్నచో ఆమెకు వైద్య పరీక్షలు చేయించి, వైద్య పరీక్ష నివేదికను గృహ హింస జరిగిన ప్రదేశము యొక్క అధికారితా పరిధి కలిగిన మేజిస్ట్రేటుకు మరియు పోలీసు స్టేషనుకు పంపవలెను;