పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(ఎ) వ్యధితవ్యక్తి ఆరోగ్యానికి, భద్రతకు, జీవితానికి, అవయవములకు లేక క్షేమమునకు శారీరకంగా లేక మానసికంగా హాని లేక గాయములు లేక అపాయమును కలిగించు లేక అట్లు చేయుటకు ప్రయత్నించుట. ఇందులో శారీరక, లైంగిక దురుపయోగము, మౌఖిక మరియు ఉద్రేకపూర్వకమైన దురుపయోగము మరియు ఆర్థికపరమైన దురుపయోగములు కూడ చేరియుండును; లేదా

(బి) ఏదేని వరకట్నము లేక ఇరర ఆస్తి లేక విలువైన సెక్యూరిటీ కొరకు వ్యధిత వ్యక్తిని లేదా ఆమెకు సంబంధించిన ఎవరేని ఇతర వ్యక్తిని శాసన విరుద్ధముగా వేధించుట, హానికలిగించుట, గాయపరచుట లేక అపాయమును కలుగజేయుట; లేదా

(సి) ఖండము (ఎ) లేక ఖండము (బి)లో తెలుపబడిన ఏదేని చర్యతో వ్యధిత వ్యక్తిని లేక ఆమెకు సంబంధించిన ఎవరేని వ్యక్తిని బెదిరించుట; లేదా

(డి) వ్యధితవ్యక్తిని ఇతర విధముగా మానసికంగా లేక శారీరకంగా గాయపరచుట లేక హాని తల పెట్టుట;

విశదీకరణ-I :- ఈ పరిచ్ఛేదము యొక్క ప్రయోజనముల నిమిత్తం, -

(i) “శారీరక దురుపయోగము” అనగా వ్యధిత వ్యక్తిని శారీరక బాధకి, జీవితమునకు లేక అవయవములకు అపాయమును, ఆరోగ్యమునకు ప్రమాదమును తల పెట్టుట లేక ఆరోగ్యమును చెడగొట్టుట, శారీరక అభివృద్ధిని నిరోధించుట మరియు అట్టి స్వభావముగల ఏదేని చర్య మరియు ప్రవర్తన కలిగియుండుట అని అర్థము, దీనిలో దౌర్జన్యం, నేరపుర్వక జడిపింపు మరియు బలప్రయోగములు కూడి చేరియుండును;

(ii) "లైంగిక దురుపయోగము"లో స్త్రీ యొక్క గౌరవమునకు భంగము కలిగించు రీతిలో దురుపయోగపర్చు, అవమానించు, చిన్నబుచ్చు, కించపరచు లేక తగ్గించుట వంటి ఏదేని లైంగిక స్వభావముతో కూడిన చర్య చేరియుండును;

(iii) “మౌఖిక మరియు ఉద్రేకపూర్వక దురుపయోగము”లో, ---

(ఎ)అవమానపరచుట, ఎగతాళి చేయుట, చిన్నబుచ్చుట, పేరుతో పిలుచుట మరియు అవమానించుట లేక ప్రత్యేకముగా పిల్లలు లేరని లేక మగపిల్లలు లేరని ఎగతాళి చేయుట; మరియు

(బి) వ్యధితవ్యక్తి అభిమానించే ఎవరేని వ్యక్తిని మరల మరల భయపెట్టుచు శారీరక బాధకు గురిచేయుట చేరియుండును.

(iv) "ఆర్థికపరమైన దురుపయోగము”లో ఈ క్రిందివి చేరియుండును,-