పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2) వ్యధిత వ్యక్తి లేక అట్టి వ్యధిత వ్యక్తి యొక్క ఏ బిడ్డకైనను రక్షణ లేక భద్రత కలిగించుటకు మేజిస్ట్రేటు సహేతుకముగా అవసరమని భావించునట్టి ఏవేని అదనపు షరతులను విధించవచ్చును లేదా ఏదేని ఇతర ఆదేశమును జారీచేయవచ్చును.

(3) మేజిస్ట్రేటు ప్రతివాది గృహ హింసకు పాల్పడుటను నివారించుటకు పూచికత్తు (ప్రతిభూతి)తోగాని అవి లేకుండాగాని బాండు పత్రం వ్రాసి ఇవ్వవలసిందిగా అతనిని కోరవచ్చును.

1974లోని 2వ చట్టము.

(4) ఉప-పరిచ్చేదము (3) క్రింది ఉత్తర్వు క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క అధ్యాయము-VIII క్రింద ఇచ్చిన ఉత్తర్వుగా భావించవలెను మరియు తదనుగుణం- గానే వ్యవహరించవలెను.

(5) ఉప-పరిచ్ఛేదము (1), ఉప-పరిచ్ఛేదము (2) లేదా ఉప-పరిచ్చేదము (3) క్రింద ఉత్తర్వు జారీచేయునపుడు న్యాయస్థానము ఉత్తర్వును అమలుపరచుటలో వ్యధిత వ్యక్తికి రక్షణ కల్పించవలసినదిగా లేక ఆమెకు లేక ఆమె తరఫున దరఖాస్తు చేయు వ్యక్తికి సహాయపడవలసినదిగా సమీపములోని పోలీసు స్టేషను అధికారిని ఆదేశించుచూ ఉత్తర్వులను కూడా జారీచేయవచ్చును.

(6) ఉప-పరిచ్చేదము (1) క్రింద ఉత్తర్వు చేయునపుడు మేజిస్ట్రేటు పక్షకారుల ఆర్ధిక అవసరాలు మరియు వనరులను దృష్టియందుంచుకుని అద్దె మరియు ఇతర చెల్లింపులు చేయుటకు సంబంధించిన బాధ్యతలను ప్రతివాది పై ఉంచవచ్చును.

(7) ఏ పోలీసు స్టేషను అధికారితా పరిధిలో మేజిస్ట్రేటును కోరినారో ఆ పోలీసు స్టేషనుకు ఇన్ ఛార్జిగా ఉన్న అధికారిని రక్షణ ఉత్తర్వులను అమలుపరచుటలో సహాయము చేయవలసినదిగా మేజిస్ట్రేటు ఆదేశించవచ్చును.

(8) వ్యధిత వ్యక్తికి చెందిన స్త్రీధనమ లేక ఏదేని ఇతర ఆస్తి లేక విలువైన సెక్యూరిటీలను తిరిగి ఆమెకు స్వాధీనపరచవలసినదిగా మేజిస్ట్రేటు ప్రతివాదిని ఆదేశించ వచ్చును.

ధన పరిహారాలు.

20.(1) 12వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద దరఖాస్తును పరిష్కరించు నపుడు మేజిస్ట్రేటు వ్యధిత వ్యక్తి లేదా ఆమె యొక్క ఎవరేని బిడ్డకు గృహహింస వలన కలిగిన వ్యయములను లేదా నష్టములను భరించుటకు ధన పరిహారమును చెల్లించవలసినదిగా ప్రతివాదిని ఆదేశించవచ్చును అట్టి పరిహారములో ఈ క్రిందివి చేరును. అయితే ఈ పరిహారము ఈ క్రింది వాటికి మాత్రమే పరిమితము కారాదు,-

(ఎ) సంపాదనలో నష్టాలు;

(బి) వైద్య ఖర్చులు;