పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద మేజిస్ట్రేటు ఏదేని ఆదేశమును జారీచేసిన యెడల, రెండు నెలల కాలావధికి మించకుండా కేసుయొక్క తదుపరి ఆకర్ణన తేదీని నిర్ధారించవలెను.

సంక్షేమ నిపుణుల సహాయమును కోరుట.

15. ఈ చట్టము క్రింద ఏదేని ప్రొసీడింగులో మేజిస్ట్రేటు సబబని భావించిన, కుటుంబ సంక్షేమ విషయములలో నిమగ్నమైన వ్యక్తితోసహా వ్యధిత వ్యక్తికి సంబంధించిన వారైనను కొకున్నను మహిళకు ప్రాధాన్యమునిచ్చుచూ మేజిస్ట్రేటు తన కృత్యములను నిరర్తించు నిమిత్తము సహాయమును పొందుటకు అట్టి వ్యక్తి యొక్క సేవలను వినియోగించు కొనవచ్చును.

ప్రొసీడింగులు రహస్యముగా కొనసాగించుట.

16. ప్రొసీడింగులలోని ఎవరేని పక్షకారు కోరినచో మరియు కేసు స్వభావమును బట్టి రహస్యముగా కొనసాగించుట అవసరమని మేజిస్ట్రేటు భావించినచో, ఈ చట్టము క్రింద ప్రొసీడింగులను రహస్యముగా నిర్వహించవచ్చును.

ఉమ్మడి ఇంటిలో నివసించు హక్కు

17.(1) తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో ఏమియున్నప్పటికిని, గృహసంబంధ బంధుత్వము గల ప్రతి మహిళ ఆమెకు ఏదేని హక్కు, హక్కు మూలము లేక లాభదాయకమైన హితము ఉన్నను లేకున్ననూ ఉమ్మడి ఇంటిలో నివసించు హకు ఆమెకు ఉండును.

(2) వ్యధిత వ్యక్తి ఉమ్మడి ఇల్లు నుండి లేక దానిలో భాగము నుండి శాసనబద్ధమైన ప్రక్రియననుసరించిననే తప్ప ప్రతివాదిచే గృహము నుండి వెళ్లగొట్టబడరాదు లేక తొలగించబడరాదు.

రక్షణ ఉత్తర్వులు.

18. వ్యధిత వ్యక్తికి మరియు . ప్రతివాదికి విన్నవించుకొనుటకు అవకాశము నిచ్చిన మీదట గృహ హింస జరిగినదని లేక జరుగగలదని ప్రధమ దృష్ట్యా మేజిస్ట్రేటు సంతృప్తి చెందిన యెడల వ్యధిత వ్యక్తికి అనుకూలంగా రక్షణ ఉత్తరువు జారీ చేయవచ్చును మరియు ప్రతివాదిని ఈ క్రింది పనులు చేయుట నుండి-

(ఎ) గృహ హింస వంటి ఏదేని చర్యకు గురిచేయకుండాను;

(బి) గృహ హింస యొక్క చర్యలు జరుగుటకు సహాయపడుటను లేక దుష్ప్రేరణ చేయుటను;

(సి) వ్యధిత వ్యక్తి పనిచేయు స్థలములోనికి ప్రవేశించుట లేక వ్యధిత వ్యక్తి బాలుడు/బాలిక అయినయెడల ఆమె తరచుగా సంచరించు పాఠశాల లేక ఏదేని ఇతర ప్రదేశములోనికి ప్రవేశించుటను;