ఈ పుటను అచ్చుదిద్దలేదు
గుఱిరయైనది. ఇది దోషము కాదనుకొందును. ఈ కృతి రసజ్ఞలోకాదరణ నందిన నాశ్రమ ఫలోన్ముఖము కాగలదు.
నేనీ గ్రంథమును ముగించు నవసరమున గుంటూరు జిల్లా బోర్డు ప్రసిడెంటుగారును, దేశభక్తులును, కళాభిమానులు నగు శ్రీ కల్లూరి చంద్రమౌళి చౌదరిగారు మా యూరు దయచేసి గ్రంథము నామూలాగ్రముగా విని పతిత్వము వహించుట కంగీ కరించుట నాయదృష్టము. వారికి నా నమస్కారములు. వారికి నేను కృతజ్ఞుడను.
గ్రంథకర్త