Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జరిగొన్న [1]వెలిపట్టు జన్నిదంబుల లుంగ
                        యంటులు వాయంగ నఱుత వైచి,


తే.

తళుకు చెంగావి[2]కోకయు, వలుఁదశిఖయుఁ,
జిగురుబొమ్మంచు పెదవులు, చిన్నినగవు,
నంద మొందంగ వచ్చె గోవిందశర్మ,
మాధవునిపట్టి యొసపరి మన్మథుండు.

42


క.

కాసల్నాటి శ్రేష్ఠుఁడు,
మీసాలప్పయ్యగారి మేనల్లుఁడు, ధా
త్రీసురతిలకుఁడు, కుసుమశ
రాసనసముఁ, డంధ్రనగరయాత్రోన్ముఖుఁడై,

43


వ.

తూర్పుఁ గనుంగొని, టిట్టిభునిం జూచి, వయస్య! సుప్రభాతంబు!
సుఖనిద్ర యయ్యెనే? శీతం బుపద్రవంబు సేయదు గదా యీ
పుష్యమాఘంబులందు?

44

శీతోపద్రవము

ఉ.

ప్రక్కలు [3]వంచి వంచి, మునిపండ్లును బండ్లును [4]రాచి రాచి, ఱొ
మ్మక్కిలఁ [5]జేసి చేసి, తల యల్లనఁ గాళుల [6]నంది నంది, లో
చక్కికి [7]నొక్కి నొక్కి యిరుచంబడ, గుమ్మడి మూటగట్టి, వీ
పెక్కి దువాళి చేసి, చలి యిక్కడ నక్కడఁ బెట్టు వేఁకువన్‌.

45


ఉ.

కుమ్ములు హవ్యవాహములు, గుత్తపు సుగ్గడితంపు దోఁపు రెం
టమ్ములు, దట్టు పున్గు మృగనాభియుఁ జాఁదును నోడె నద్దిరా!
యమ్మకచెల్ల యింక నవయౌవనదర్పనఖంపచంబు లౌ
కొమ్మలచన్నులన్‌ సరకు గో నటులున్నవి వో తుషారముల్‌.

46


శా.

స్థూలద్విత్రిపటావకుంఠనముఁ, గస్తూరీరజఃపాళికా
కాలాగు ర్వనులేపనంబులను నుద్ఘాటించి, ధాటీగతిన్‌

  1. సమకట్టు (మూ.ప్ర.)
  2. కోరలు (మూ.ప్ర.)
  3. వంచు
  4. రాయు
  5. జేయు
  6. నందు
  7. నొక్కు (మూ.ప్ర.)