Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నంగజకేళిఁ బల్లవుల నార్భటులం గరగింపనేర్చు నీ
జంగమువారి కాంత రతిజాణశిఖామణి యెంచి చూడఁగన్.

27


సీ.

తళ్కు తళ్కను కాంతి బెళ్కు కెంపుల ముంగ
                        రందమై కెమ్మోవి యందుఁ గుల్క,
ధగ ధగ ద్ధగలచేఁ దనరారు బంగారు
                        గొలుసు లింగపుఁగాయ కొమరుమిగుల,
నిగ నిగ న్నిగలచే నెగడు చెల్వపుగుబ్బ
                        మేరు మిన్నందున మెలఁగుచుండ
రాజహంసవిలాసరాజితంబగు యాన
                        మందు మెట్టెలు రెండు సందడింప,


తే.

సరసదృక్కుల విటులను గరఁగఁ జూచి,
పొందికైనట్టి మోమున భూతిరేఖ
రాజకళ లొప్ప నద్దంకి రాజవీథిఁ
బొలిచె నొకకొమ్మ, గాజుల ముద్దుగుమ్మ.

28


ఉ.

శ్రీకరభూషణంబులును సిబ్బెపు గుబ్బలు, ముద్దుచెక్కులున్,
గోకిలవంటి పల్కులును గొల్చినఁ జేరలఁ గేరు కన్నులున్,
బ్రాకటదేహకాంతియును, బంగరుచాయకు హెచ్చువచ్చు నీ
చాకలివారి సుందరికి, సాటిగ రా రిఁకఁ దొంటి జవ్వనుల్.

29


సీ.

మకరధ్వజునికొంప యొకచెంప కనుపింపఁ
                        జీర కట్టినదయా చిగురుఁబోఁడి,
యుభయ[1]పక్షములందు నురుదీర్ఘతరములౌ
                        నెరులు పెంచినదయా నీలవేణి,
పసుపు వాసన గ్రమ్ము పైట చేలము లెస్స
                        ముసుకుఁ బెట్టినదయా ముద్దుగుమ్మ,

  1. కక్షము