Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాత్రి యెవ్వాఁడొ బల్ రతుల గాసి యొనర్ప
                        బడలిక నడుగులు తడఁబడంగ,
వింతవారలఁ జూచి వెస నవ్వినను కప్పు
                        గల దంతముల కాంతి వెలికి [1]జాఱఁ,
జడిముడి నడచుటఁ జెలరేగి గుబ్బల
                        పైఁ దాకి యొక్కింత పైట జాఱఁ,


తే.

జెమటచేఁ దిరునామంబు చెమ్మగిల్ల,
హాళి డా చేత విడియంబుఁ గీలుకొలిపి,
రంగపురి రాజవీథిఁ గానంగ నయ్యె,
నాదు మదిఁ గోర్కె లూర వైష్ణవవధూటి.

15


క.

రంభాస్తంభము లూరువు,
లంభోరుహనిభము లక్షు లతనుశరంబుల్,
జంభాసురారి మదగజ
కుంభము లీ నంబివారి కోడలి కుచముల్.

16


సీ.

మీఁగాళ్ళ జీరాడు మేలైన కుచ్చెళ్ళ
                        తీరున మడిచీరఁ దీర్చికట్టి,
బిగువుగుబ్బలమీఁద నిగనిగల్ దళుకొత్తు
                        నోరపయ్యెద కొంగు జాఱవైచి,
వలపుల కొకవింత గలుగఁగా గొప్ప లౌ
                        కురులు నున్నగ దువ్వి కొప్పు పెట్టి,
నెలవంక నామంబు సలలితంబుగ నుంచి
                        తిరుచూర్ణ మామీఁదఁ దీర్పుచేసి,


తే.

యోరచూపుల విటులఁ దా నూరడించి
గిల్కు మెట్టెల రవరవల్ గుల్కరింపఁ

  1. రాల