| ఉ. |
మచ్చికయున్, బ్రమోదమును మన్ననయున్, నయమున్, విలాసమున్,
మెచ్చును, నేర్పడం దనకు మేయిడి మ్రొక్కిన కామమంజరిన్
గ్రుచ్చియుఁ గౌఁగిలించె, సరిగుబ్బచనుంగవ రెండుక్రేవలన్
బచ్చనివింటిజోదు పయిపైఁ బులకంబులు నారు వోయఁగన్.
| 283
|
| వ. |
అనంతరం బాసనాసీనులైన, నగ్గోవిందుండు కామమంజరిం
జూచి,
| 284
|
| మ. |
అరవిందాస్య! తలంచి చూడ నిది యత్యాశ్చర్యమో కాని, నీ
సరసాలాపము లాదరించి వినఁగా సంభావనం జూడఁగన్,
ఖరపాకం బయి కర్ణరంధ్రముల కంగారంబుగా, బిట్టు ని
ష్ఠురముల్ పల్కెడు రాజకీరములు గండుంగోయిల ల్వీణియల్.
| 285
|
టిట్టిభసెట్టికి తమ్మడిసానితోడి సాంగత్యము
| వ. |
అని జారదంపతులు పూజరివారి యింటిముంగిట, వెన్నెల బైట
నుండి, టిట్టుభునకుం గట్టాణిముత్తియంబునుం బోని తమ్మడి
[1]సానిం గూర్పు నేర్పు విచారించి, సన్నపుటెలుంగునం బూజరి
సానిం బిలిచి, కనకనిష్కంబుతోడఁ గూడఁ గర్పూరంబు
వీడియం బచ్చేడియచేతిలోనం బెట్టి, యాపాదమస్తకంబు
వీక్షించి శిరఃకంపంబు సేసి,
| 286
|
| సీ. |
బంగారుతలుపులు పాయంగ ధట్టించి
లావణ్యవిత్త మేలా వ్రయించె?
లావణ్యవిత్త మేలా వ్రయించున గాక!
యతిమాత్ర మేలా ప్రయాసపడియె?
|
|
- ↑ సానికూతుం