Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యా దివ్యగంధర్వి కపరావతారంబు
                        మధుమావ తోర్గంటిమండలమున,
[1]నా సుందరాంగి దక్షారామమునఁ బుట్టు
                        భువనమోహిని చిన్నిపోతి యనఁగ,
నప్సరస్ స్త్రీజాతి యగు యా సానికూఁతురు
                        చిరకాలమున సదాశివునిఁ గూడి


తే.

పావనంబైన తమిలేటి పరిసరమున,
వేఁగి కురువాటికాదేశవిపినభూమిఁ
[2]గోవులను పేరి చెంచులకులమునందుఁ
గడిమి కత్తులయమ్మి నాఁ గలుగఁగలదు.

242


ఆ.

కడిమి కత్తులమ్మి నిడువాలుఁగన్నులు
గండుమీల [3]నడచు మిండగీడ!
దాని చన్నుదోయి ధారాసురత్రాణ
కటకకుంభికుంభకలహకారి.

243

మదాలసవృత్తాంతము

వ.

ఈ మధుమావతీదేవి చెలియలు మదాలస, మా మామ మీసాలప్ప
య్య ద్వివేదుల కొడుకు శ్రీధరునకు ననుపు లంజెయై యుండు;
నా కంజాక్షిం దగిలి యా రంజకుం డచ్చోటనే యున్నవాఁ డని
విన్నార మరయుదము గాక! యనుచు మోసాలం జొచ్చి కక్ష్యాంత
రమ్ములు గడచి, గాజుటోపరిముందటఁ గటకంబళంబులమీఁదఁ
దమలో జిటపొట వోవుచుం గూడియుం గూడక యున్న యప్ప
చెలియండ్రను మామయాత్మజునిం జూచి, గోవిందుండు మంద
స్మితంబునఁ బటు ............... (గ్రంథపాతము)

244


తే.

అహి వెట్టితి జొన్నగడ్డాగ్రహార
వృత్తి యేనూఱురూకలవృత్తమునకు,

  1. మధుమావతి దాక్షారామమునఁ బుట్టు (?) (మూ.ప్ర.)
  2. గోవిలనుపేరి (మూ.ప్ర.)
  3. ననుపు మిండఁగీల (మూ.ప్ర.)