Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మిహిపదంబుగఁ బాములమెంగఁ డూదె
భోగిరాజులు నర్తింప నాగసొరము.

224


వ.

అట చని, ముందట నొక్కమంటపంబున విటభటపట
లంబు నెదురుకట్ల నార్భటింప టిట్టిభుండు విని, గోవిందశర్మ
నడిగిన,

225

తూర్పునాటి గడిఁడు

సీ.

నున్నవై నలుపెక్కి నొసలఁ జేరువ కంటి
                        కెకువ వైచిన శిఖ పెకలుచుండఁ
గరసానఁ దిగిచిన కలివె గందపుబొట్టు
                        తిరికట్టుకొని మోము తిరిగియుండఁ,
దటపెట దిమికిట ధ్వను లోలిఁ బుట్టింపఁ
                        జాలు గుమ్మెట చంక వ్రేలుచుండ,
నలుకనై మీఁజేత నంటిన యా క్రొత్త
                        మువ్వలత్తెము [1]సారె ములుగుచుండ,


తే.

నొసలు స్రుక్కించు నావుర్న నోరు దెఱచు,
గ్రుడ్లు మిడికించు, రాగంబు [2]గుమ్మడించు,
పాడుగతులకుఁ దను దానె పరగి యాఁడు;
నల్ల యాతండువో తూర్పునాటి గడిఁడు!

226

పొట్టేళ్ళపోరు - పందెములు

వ.

అనుచు నట పోవఁ, గంటె కిరాట! రెండు మేషకంఠీరవంబు లా
నీరాటరేవున నీరను ముంచి సంచితంబున నస్యంబు సేయుచుఁ
బెంచుటం జేసి, ధేనువుల ననుధావనంబు సేయు వత్సంబులుం
బోలె, వాత్సల్యంబునం దమయేలికలవెంటఁ గంఠగ్రైవేయ
ఘంటికాటంకారంబులును, విషమవిషాణకోటిఘటితకలా

  1. సాలె (మూ.ప్ర.)
  2. గ్రుమ్మరించు (మూ.ప్ర.)