Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వచ్ఛందచారిణులకు మంచెన దీవెన

సీ.⁠

చెలఁగి చెలఁగి పొత్తి[1]చీరలు గట్టెడు
                        మాసకమ్మకు దీర్ఘమాయు రస్తు!
సారె సారెకు దేవసదనంబులకు నేఁగు
                        చెడిపెకు సంకల్పసిద్ధి రస్తు!
నిత్యంబు వ్యభిచారనిష్ఠతో నుండెడు
                        విధవకుఁ బుత్రాభివృద్ధి రస్తు!
దళముగాఁ దులసిపేరులు ధరించినయట్టి
                        విశ్వస్త కారోగ్యవిభవ మస్తు!

⁠


తే.⁠

మిండముండకు సంపత్సమృద్ధి రస్తు!
పఱచుతెంపికి నిత్యసౌభాగ్య మస్తు!
వదరుఁగల్కికి నీప్సితావాప్తి రస్తు!
బలువితంతుకు మైథునప్రాప్తి రస్తు!

⁠ 214


వ.⁠

అని యట చనునప్పుడు,

⁠ 215

మంచన కామమంజరి ననునయించుట

వ.⁠

అనిన, [2]గాంధర్వి పరదేశపట్టణంబుల వితంతువుల చేత వక్షః
కుట్టనంబు సేయించుకొన మరిగి, నీ వెట్టు మమ్ముం దలంతువు?
పదపద, విచ్చేయు, మనుచు నీర్ష్యాకుటిలం బగుకటాక్షంబునం
జూచిన,

⁠ 216


చ.⁠

లవ లవఁ జన్నుదోయి గదలన్‌, దొలుకారుమెఱుంగుఁదీఁగలం
గవ కవ నవ్వుడాలు వలికన్నుల మించులు చౌకళింపఁగా,
నవ నవ యౌవనంబు గల నాఁటి భవత్పురుషాయితోద్ధతుల్‌,
శివ శివ! యెన్నిభంగులను జిత్తములో మఱవంగ వచ్చునే?

⁠ 217
  1. ↑ చీర గట్టెడు మాసకమ్మకుఁ జాల దీర్ఘాయు రస్తు (మూ.ప్ర.)
  2. ↑ గాంధారి (మూ.ప్ర.)