Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బత్రిసమాన! నేటి యపరాహ్ణసమాగమవేళఁ, బుష్యన
క్షత్రమునందు, నీ యనుఁగు గాదిలికూఁతురు, చూచు నద్దమున్‌.

194


క.

ఆవేళ నీవు బిడ్డకు,
దీవనమంత్రంబు చెప్ప దీర్ఘాయు వగున్‌,
లావణ్యంబు వివేకము
ప్రావీణ్యము వైభవంబు భాగ్యము గలుగున్‌.

195


తే.

ముకురవీక్షావిధానంబు మొదల లేక,
వెలపడంతికిఁ గారాదు విటునిఁ గవయ,
యాయజూకున కెట్లు చేయంగవచ్చు
నరణిసంగ్రహ మొనరింప కధ్వరంబు?

196


తే.

లంజెవారికి శ్రీమహాలక్ష్మి గాదె
దర్పణము విప్రముఖ్య! గంధర్వగణము
పుణ్యచారిత్ర! దృష్టాంతభూమి గాదె
దర్పణమ్ము వివర్తవాదముల కెల్ల?

197


ఉ.

ఉన్మదమత్తకోకిల కుహూకలపంచమరాగరాగసం
పన్మహనీయమైన మధుమాసపుఁ బున్నమనాఁడు, బిడ్డకున్‌
మన్మథవేధదీక్ష పదినాళ్ళగు మాత్రము, నేతదర్థమై
సన్మతి నుండఁగావలయుఁ జక్కనివాఁడవ యక్కవాడలోన్‌.

198


సీ.

[1]అదె నీ కుమారిత మదనరేఖాకన్య
                        వదనరేఖావైభవమునఁ జంద్రు
[2]దొరఁ గూర్చికొన్నది ధూర్తదేవత, నిన్నుఁ
                        దండ్రిఁ బోలినయట్టి తరళనయన,
సాముద్రికాగమజ్ఞానపారీణులు
                        కడుభాగ్యసంపద గలది యండ్రు,

  1. ఈపద్యమున ప్రశ్నోత్తరములు గలవు.
  2. ధృతి (మూ.ప్ర.)