| |
నాడెఁ బీటలపై నోలిఁ గూడియున్న
యక్క లేడ్వురలో నొక్కయలరుఁబోఁడి.
| 137
|
| చ. |
హర! హర! యింత యొప్పునె మహారభటిన్ జగఝంకృతస్వన
న్మురళిని మిశ్రితాంకరవమూర్ఛలఁ [1]జిత్తము లుబ్బి, యక్క లే
డ్వురు నదె యాడఁజొచ్చిరి కడుంగడు వేడ్క, సమున్నమత్పయో
ధరయుగభారభీరుతమతన్వవలగ్నము లైననృత్యముల్.
| 138
|
| వ. |
ఇదె మాయింటియజమానుండు సంతానకాంక్షియై, ప్రతిబంధనోద
నార్థంబు యక్షకన్యలం బరీక్షారాధనంబు సేయుచున్నవాఁడు
గావలయు. మాణిభద్రకులోద్వహు లైనదేవతలు కామవల్లి శ్రీమహా
లక్ష్మితోఁ గూడి యపేక్షితకార్యంబు మనకు నవ్యాక్షేపంబునం
జేయుదురుగాక! యనుచు విశ్వాసంబుతో నమస్కారంబు సేసి,
కాసల్నాటి గోవిందమంచనశర్మ, నర్మసఖుండు దాను నట చని
ముందట,
| 139
|
| ఆ. |
మంద్రమధ్యతారమానత్రయాభిన్న
మహిషశృంగనాదలహరిఁ గూడి,
డమరు డిండిమంబు డమడమ ధ్వని మ్రోసె,
నద్భుతం, బ దేమి యార్భటంబు?
| 140
|
మైలారవీరభటుల పటుసాహసకృత్యములు
| సీ. |
ఱవఱవ మండు నెఱ్ఱనిచండ్రమల్లెల
చోద్యంపుగుండాలు చొచ్చువారు,
కరవాఁడియలుఁగుల గనపపాఁతర్లలో
నుట్టిచేరులు గోసి యుఱుకువారు,
|
|
- ↑ బెత్తము (మూ.ప్ర.)