Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వలరా జొక్కొక మూర్ఛనాస్వరమునన్‌ బ్రాణంబు గల్పింపఁగాఁ,
గలకంఠీకలకంఠకోమలకుహూకారంబు తోరంబుగన్‌.

131


మ.

అకలంకస్థితిఁ గోరి కొల్చెదరు బ్రహ్మానందభావంబునన్‌
సకలానందమయైకమాత యగుచున్‌ సంతోషచిత్తంబునన్‌
[1]తక దుం దుమ్ములు, తాళముల్‌, జవనికల్‌, తందాన, లమ్మయ్యకు
న్నెకవీరమ్మకు, మాహురమ్మకు, నథోహ్రీంకారమధ్యాత్మకున్‌.

132


శా.

ఆలోకింపక మ్రొక్కరాదు నిజభక్య్తావేశసంపత్తిమై,
నాలోకించినఁ జిత్త మెట్లగునొ కామావేశసంయుక్తిమై?
నేలాగోయి కిరాట? మానుదమొ? సంవీక్షింతమో? చెప్పుమా!
వ్రీళాశూన్య కటీరమండలము దేవీశంభళీవ్రాతమున్‌.

133

కాఁపు పూవుఁబోఁడి కైసేఁత

సీ.

[2]జఱివోని గడితంపుఁ జిఱుతచౌకంబుల
                        తొగరుఁబుట్టము కచ్చఁ దొడివి కట్టి,
యోలగందపుబొట్టు నుపరిభాగంబుపై
                        సిందూరతిలకంబుఁ బొందుపరచి,
పసరు దారెడు నింబపల్లవంబులదండ
                        గుబ్బచన్నులమీఁదఁ గుదురుగొల్పి,
క్రొత్త తోమిన దంతకోరకంబులయందుఁ
                        తాంబూలరాగంబు తళుకు గూర్చి,


తే.

సకలసంధ్యంగములకుఁ దేజంబు గలుగ,
మధుమదారంభ మణఁకువ మరలఁ ద్రోవఁ
దేఁకువయు నారజంబునుఁ దేటపడఁగఁ
బురమునకు వచ్చె నొకకాఁపుఁ బూవుఁబోఁడి.

134
  1. తకదుమ్ముల్‌ యొకతాళముల్‌
  2. చరివోని (మూ.ప్ర.)