కుట్టుపనివాని కొంటెచూపులు
చ. |
కొలుచును, జేన వెట్టుఁ, గుచకుంభయుగం బెగడిగ్గఁ గన్ను గ్రే
వలఁ బరికించు, గక్షముల వైచును దృష్టులు మాటిమాటికిన్,
గలికితనంబునం దఱచుగా నగు సౌచిక పల్లవుండు, గం
చెల [1]వెసఁ గుట్టి యీఁడు వెల చేడియకున్, విషయాభిలాషియై.
| 106
|
వ. |
అనుచు నవ్వాడ గడచి, యట యుత్తరంబు సనునప్పుడు
ముందట నొకయింటిమఱుంగున మచ్చెకంటిం బొడగని,
| 107
|
ఈ రీర్చు చకోరనేత్ర
ఉ. |
సారెకు సారె కేమిటికిఁ జంపెదు గోరఁట యెఱ్ఱలైన వా
లారు నఖాంకురంబుల వయస్య కచంబునఁ, బాట పాడి, యీ
రీరిచి, సీత్కృతుల్ చెవుల కిం పొనరింపఁ జకోరనేత్ర! నీ
చారుకుచద్వయంబు మముఁ జంపెడు దోసము నీకుఁ జాలదే?
| 108
|
.
మగపోఁడిమి వైఖరితోఁ బసపు నూరు పడఁతి సొబగు
మహాస్రగ్ధర. |
పరిపాటీఖర్వఖర్జూపరతిసమయసంభ్రాంతసంభోగభంగిన్,
దరుణీరత్నంబు హేలాతరళగతి హరిద్రారజఃకర్దమంబుం,
గురు లల్లాడంగ, వీఁగుం గుచములు కదలం గొంతు కూర్చుండి నూఱెన్
గరవల్లీకాచభూషాకలమధురఝణాత్కారముల్ తోరముల్ గాన్.
| 110
|
- ↑ తెగఁ గుట్టి (మూ.ప్ర.)