ఈ పుట అచ్చుదిద్దబడ్డది
86
కువలయాశ్వచరిత్రము
- న నిలిచి తన్నుఁ బోరునెడఁ గుబేరకుమారు కుక్కుటకంఠీరవంబు వెనుక నడచి
- కేడించి చుట్టుకొని చురుక్కునం జుట్టు నొక్కినఁ గ్రక్కున నది లేదనిపించి యె
- దిరి చరణాయుధంబునకు నడ్డంబుగా నడచి యారె విరుగందన్నిన నంజక యక్షకుం
- జరుని పుంజు బిరబిరంజుట్టి రెట్టలోపలం దల సొనిపి గిలిగింతలు గొనినం బ్రతిపక్షియు
- నెగిరి తప్పించుకొని గుప్పున నవ్వలం గుప్పించి యెదురై యులికి కరము వందురిన
- నలకూబరుని కోడియు సమందరయంబునం గ్రిందికిఁ దగ్గి నెత్తురు జొత్తిల్లఁ గుత్తుక
- కఱచి వెనుకకు మ్రొగ్గి యీడిగిలంబడిన నరాతియు మెడముడి విడిపించుకొని త
- రిమిన గ్రమ్మికొను చెమ్మట నపయ మున్నె యోడెననుచు నెల్లవారలు గొల్లుగొల్లున
- నవ్వుచు నెన్నుకొనం గిన్నరరాజకుమారుని చరణాయుధంబు సేదదేరి యడియాస
- లం దన్నికొనివచ్చు నభియాతి నలయించి నిలువంబడునెడం జేరి పారిపో
- వందన్నిన.209
గీ. కేరి తొడఁ దట్టికొని బిట్టుకేక వైచి, మీసములు దీటి యెదిరికి రోస మొదవ
- డవిణ వాయింపఁజేయుచు డాసి పుంజు, నట్టె చూచుచు నున్నట్టి యతనిఁ గాంచి.210
చ. ఉడిగపువారు చేరి సమయోచిత మేతగఁ దెల్పుసుద్దులే
- నుడువుచు నౌగదా యని కనుంగొన దేవర సంతరించు నె
- క్కుడువగపుంజుతోడ నొకకోఁడి యెదుగ్చునె యంచుఁ జెంతకుం
- వడిఁజని యయ్యగారు పిలువంబనుపం బని వింటి మంచనన్.211
సీ. ఒక్కఁడు చెంపకై యొరఁగుపువ్వులతోడి దసిలీరుమాలు వందముగఁ జుట్ట
- జేరి యొక్కండయ్యగా రిచ్చుకట్టు వర్గములకు ముల్లెలు గైకొనంగ
- నొక్కండు దరహస మొదవంగ నేటికుక్కుటము కేడించిన గొడవఁ దెల్ప
- నొక్కండు రంభాపయోజాక్షి పడవ గెల్చినమాట విని సంతసించు ననఁగ
- నఱిగి తండ్రికిఁ బ్రణమిల్లి యతఁడు కమ్మ, వచ్చుటలు దెల్పి తేజీదు వాలి నోలి
- నలసియున్నాడ నీ వేగు మనుచు ననుప, నగుమొగంబున వీయని నగరు వెడలి.212
సీ. సానిపటాణి తేజిని ముందర నిల్పి సామి యటంచు సలాము సేయ
- మావటీఁడు గజోత్తమముఁ దెచ్చి యంకుశంబు దనర్చుకేళితో మ్రొక్కు వేయ
- సారథి రథముకన్ చాయనుఁ బోనిచ్చి యటు నిల్పి వచ్చి జోహారు సేయ
- దాకాధినాథు డరదము ముందరనిల్పి తమిసపొత్తులతోడ దండ మొసఁగ
- పావలటు మీటి కొల్లారు బండి యెక్కి, దురదురన రంభ యింటికి నరిగి తనదు
- పయన మెఱిగించి సమ్మదపడనిదాని, గుస్తరించుచు ననిపించుకొని యతండు.213