ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
79
- గర ముత్సాహముఁ జెందిపొంగెడు నదే కాదా మహాచిత్రమై
- యిరవొందెన్ మది నాకు నాకె వెరగయ్యెంగంటివే యిచ్చటన్.156
క. ఐనప్పుడే మదాలస, గానోపుఁ జుమీ లతాంగి కాకుండినచోఁ
- గానీ కాకుండు బలా, యీనిగనిగజిగులు గందుమే యెందైనన్.157
సీ. మోముచాయయె కాదు ముద్దుపల్కులలోని తఱితీపు మెడగుల్కు దానివగయె
- మోవి కావియ కాదు మఱిపెంపు పెంపుతో నాను జంకెనచూపు దానివగయె
- పలుసోయగమె కాదు పచ్చిదేరఁగనాఁడు తరుణి పైబొమముడి దానివగయె
- మోముచాయయె కాదు ముద్దుమాటకుఁ జెక్కులో నిండు లేనవ్వు దానివగయె
- అన్నియును నాయెఁగా యీమృగాయతాక్షి, యదిగొ గూర్చున్నరుంద్రలీలాంబుజంబు
- వలని యొల్లమి మూర్కొన్న చెలువు దాని, వగయె కావలె బాపురే వనజజన్మ.158
క. అని సమవస్తునిరీక్షణ, మున సరిసేయంగ బుద్ధి పొడమితలఁచి యా
- జనపతి రతివిపరీవృత, మన మతిచంచలము గాఁగ మఱియుం దనలోన్.159
గీ. ఇది మదాలస యగునేని యిచట కెట్టు, లఱుగుదెంచెనో దీనిప్రాణంబు లైన
- యల్ల కుండల యిప్పు డే మయ్యెనొక్కొ, వీరి కెడఁబాయవలసెనో విధికృతమున.160
సీ. అలనాఁడు మందరాహార్యకందరభాగమునఁ గుందఁగాఁ బలాశనకులాగ్ర
- జాతుమాయాతివిఖ్యాతు భీతామరవ్రాతుని బాతాళకేతుఁ గూల్చి
- ప్రమదంబుతోఁ దేజిపైకి రమ్మన నాలుగడుగులు పిఱుదన నఱుగుదెంచి
- యటునిల్చి మురిపెంపుటల్లిక సిగ్గుతో గొరలు కొంకునఁ బైటకొంగు నేల
- నలమి యీకాంత వింతదైన్యంబు నెట్టి, కొనఁగ ననుఁ జూచి దానిఁ జూచిన నెఱింగి
- వనితతోఁ గూడ దాని నావెనుక నుంచి, తోడి తెచ్చితిఁగాదె మత్పురమునకును.161
ఉ. అంబరవీథిపైఁ గువలయాశ్వము మీరి లకోరి కోల వే
- గంబునఁ బోవ వెన్నువెనుకం దగుదానివశంబుగాక రాఁగ
- గంబున దానిమోవి పలుగం టొనరింపక దానిపాలభా
- గంబునఁ జిందులాడు నలకంబులు దీర్పక మోసపోదునే.162
చ. విడివడిరువ్వనన్ గగనవీథికి గుఱ్ఱము చౌకలించినన్
- వడకుచు గబ్బిగుబ్బలమొనల్ వెస వెన్నున నాఁటి రొమ్మునన్
- వెడలఁగ గోలతుంగ భయవిహ్వలమై ననుఁ గాగళింప న
- ప్పడతి మదీయవేగరసభంగ మొనర్చె భయాబుఁ దెల్పుచున్.163
సీ. ఎదురుకోవలెనంచు నేతెంచు మన్నెవారలఁ జూచి దవ్వుదవ్వులనె తిరుగ