ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
77
చ. చిలుకలలోన చిల్కలయి చెల్వపుటంచలలోన నంచలై
- తెలివి పొసంగు తీవియలఁ దీవియలై సరసంపుఁ బల్కులన్
- గులుకునడల్ పసిండితలుకుల్ గల మేనులు గానుపింపఁ జే
- తుల కసివోవఁ దేనియలతో ననతోయములెల్ల గిల్లుచున్.141
సీ. కలిగొట్టుఁ జేరబో కళి గొట్టు సేయు నీ బీర మేమిటికి జంబీర మదిగొ
- సిందువారము తెనె సిందు వారము లేని పైరుగాఁదేఁటి కింపై రుచించుఁ
- జూతము పదరమ్మ చూతము మదవతీగానంబు లచ్చోట గానరావె
- రమ్ము మారుని గుడారమ్ము మారు నిజమ్ము గుంపుచోటుల గుజిగుంపు లేల
- యీరమా యీరమానీతి యీప్రసూన, వాసనల్ వాసనల్ వంక నందికొనఁగ
- పాటలాపాటలాళిచే పడియె ననుచు మాటకే మాట కేమి లేమావివిరులు.142
క. అని జవ్వను లవ్వనిఁ గ్రొ, వ్వునఁ బువ్వులు గోసి కడు చవుల్కొను నవ్వుల్
- నన రువ్వులు కొందరు మెచ్చనిచివ్వలు నివ్వటిల్లుఁ జుని యవ్వలనన్.143
సీ. కంబముల్ గాన నిల్కడఁ గన్న పోఁకబోదియలపై వడిగాగ దీటుకొన్న
- యలదీవ చాలు వాకిలి సొచ్చి లేమావిగుమురుల క్రీనీడఁ గొప్పకెంపు
- లలితంపు మెట్లఁ గేళాకూళికవ్వల జలయంత్రముల వీఁగు చలువగాడ్పు
- గదియంగఁ గలువ మేల్కట్టు పూవుల గప్పు సాంబ్రాణి దూపంపుజలదపాళి
- నరసిఁ బురివిప్పఁ జను నెమ్మి నాస గలుగు, దాని గాఁ జేసికొనెడి చిత్తరువుబొమ్మ
- చిలువచెలువంపు జడగుంపు సొలపు నింప, నీఁడు గానని యొకచిన్నిమేఁడమీఁద.144
క. చెలువైన పసిడిగద్దియఁ, గొలువై నలువంకఁ జెలువగుంపులు గొలువన్
- బలువైఖరి పావడ నెల, తలు వైవఁగఁ గన్నెయున్నతఱి నటమున్నన్.145
శా. ఆజన్మస్థిరధర్మకర్మనిపుణుం డౌరాజు రాచిల్క మే
- త్తేజీ జో ల్తేదొక పొంత కాఁడయి తనుం ద్రిప్పంగ నయ్యింతి య
- య్యోజన్ వచ్చుట గొలెఁ బూపొదలలో నున్నట్లు వీక్షించి యా
- రాజీవేరేక్షణ వెంటనంటఁ జని గారామారసౌధస్థలిన్.146
క. వలభిన్మణిగణగుంభిత, వలభిం దద్రుచి తమంబు వలఁగొని పొదువన్
- జలదాచ్ఛాదితుఁడగుత, మ్ములదాయ య యనంగ నిలిచి ముదితం జూడన్.147
శా. ఏకై కాంగవిలోకనాకలనతుష్టైకాంతసామంతభా
- వాకూతంబులు తద్విధాతృరచనాత్యార్చర్యగాఢాప్తమూ
- ర్ధాకంపంబులుఁ దత్సమానకృతమానాధీననానావచ